News April 4, 2025

జూరాలలో పోలీస్ అవుట్ పోస్ట్‌కు డీజీపీ భూమి పూజ 

image

వనపర్తి జిల్లా అమరచింత మండలం ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టులో నూతనంగా ఏర్పాటు చేసే పోలీస్ అవుట్ పోస్ట్ భవన నిర్మాణానికి రాష్ట్ర డీజీపీ జితేందర్ శుక్రవారం భూమి పూజ చేశారు. రూ.కోటితో దీనిని నిర్మించినట్లు డీజీపీ తెలిపారు. ఈ కార్యక్రమంలో మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, ఐజీ రమేశ్ రెడ్డి, డీఐజీ చౌహన్, ఎస్పీ రావుల గిరిధర్, కేశం నాగరాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Similar News

News February 14, 2026

రామాయంపేట: డైరెక్టర్‌గా ఉంటూ.. కౌన్సిలర్‌గా గెలుపు

image

మహంకాళి దేవాలయం డైరెక్టర్‌గా సేవలు అందిస్తున్న బైరం స్వప్న, ఇప్పుడు రామాయంపేట కౌన్సిలర్‌గా తన ముద్ర వేశారు. 4వ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆమె, సమీప బీఆర్‌ఎస్ అభ్యర్థిపై 139 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. గతంలోనే ఆమెను దేవాలయ డైరెక్టర్‌గా ఎమ్మెల్యే రోహిత్ నియమించారు. ఆధ్యాత్మిక సేవలతో పాటు ఇప్పుడు వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని స్వప్న ధీమా వ్యక్తం చేశారు.

News February 14, 2026

ప్రొద్దుటూరులో నేటి బంగారు, వెండి ధరలు

image

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో శనివారం బంగారు, వెండి ధరల వివరాలు.
* బంగారు 24 క్యారెట్ల ఒక గ్రాము ధర రూ.15,800
* బంగారు 22 క్యారెట్ల ఒక గ్రాము ధర రూ.14,536
* వెండి 10 గ్రాములు ధర రూ.2,550.

News February 14, 2026

సిద్దిపేట జిల్లాలో హస్తం, కారు జోరు.. కమలం బేజారు !

image

సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక, గజ్వేల్, చేర్యాల, హుస్నాబాద్ మున్సిపల్ పోరు కాంగ్రెస్, BRS మధ్యే జరిగింది. గట్టి పోటీ ఇస్తుందని భావించిన బీజేపీ హుస్నాబాద్, చేర్యాలలో కనీసం ఖాతా తెరలేదు. దుబ్బాకలో 2 సీట్లు గజ్వేల్లో ఒక సీటుకే పరిమితమైంది. మొత్తం 4 మున్సిపాలిటీల్లో 3 BRS, ఒకటి కాంగ్రెస్ దక్కించుకుంది. మున్సిపల్ ఫలితాలపై BRS, కాంగ్రెస్ శ్రేణులు జోష్లో ఉండగా బీజేపీ శ్రేణులు నిరాశలో ఉన్నారు.