News October 5, 2024
జూరాలలో 11 యూనిట్లలో విద్యుదుత్పత్తి
జూరాల ఎగువ, దిగువ విద్యుత్ కేంద్రాలలో శుక్రవారం 11 యూనిట్లలో విద్యుదుత్పత్తి చేపట్టినట్లు ఎస్ఈ సూరిబాబు తెలిపారు. ఎగువలో 5 యూనిట్ల ద్వారా 196 మెగావాట్లు, 229.586 ఎం యూ, దిగువలో 6 యూనిట్ల ద్వారా 240 మెగావాట్లు 204.994 ఎంయూ ఉత్పత్తిని చేపట్టామన్నారు. ఎగువ, దిగువ జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో ఇప్పటి వరకు 434.580 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తిని సాధించామని తెలిపారు.
Similar News
News November 25, 2024
MBNR: జాగ్రత్త.. తప్పులు ఉండొద్దు: డిప్యూటీ సీఎం
కుల గణన కుటుంబ సర్వే డాటా ఎంట్రీలో ఇలాంటి తప్పులు ఉండొద్దని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. జార్ఖండ్ నుంచి వీసీ నిర్వహించి ఆయన ఉమ్మడి జిల్లా కలెక్టర్లతో మాట్లాడారు. అందుబాటులో లేని వాళ్లకు ఫోన్ చేసి సర్వే గురించి వివరించి సమాచారం తెలుసుకోవాలని, ఫుడ్ పాయిజన్ విషయంలో ఆరా తీశారు. ఆహారం, పరిశుభ్రతపై దృష్టి పెట్టాలని, డాటా ఎంట్రీలో ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూడాలని అధికారులకు ఆదేశించారు.
News November 25, 2024
ఉమ్మడి పాలమూరులో కుల గణన సర్వే వివరాలు ఇలా!
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇంటింటి సమగ్ర కుల గణన సర్వే శరవేగంగా కొనసాగుతుంది. ఆదివారం నాటికి మహబూబ్ నగర్-99.8%, నాగర్ కర్నూల్-96%, నారాయణపేట-99.5%, గద్వాల్, వనపర్తి జిల్లాలో దాదాపు పూర్తయినట్లే. ఇంటిదగ్గర అందుబాటులో లేని వాళ్లకు ఫోన్లు చేసి వివరాలు సేకరిస్తున్నట్లు ఆయా జిల్లాల కలెక్టర్లు తెలిపారు. సర్వేలో వివరాలు నమోదు చేసుకోలేని వాళ్లు ఆయా మండలాల ఎంపీడీవోలకు, మున్సిపల్ కమిషనర్లను సంప్రదించాలన్నారు.
News November 25, 2024
గత ప్రభుత్వంలో అరాచకాలు, దోపిడీలు: జూపల్లి
BRS ప్రభుత్వంలో అరాచకాలు, దోపిడీలు జరిగాయని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. ఆదివారం MBNR కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ప్రణాళిక సంఘం వైస్ ఛైర్మన్ చిన్నారెడ్డితో కలిసి మాట్లాడారు. ఏడాది పాలన పూర్తవుతున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా విజయోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. తమ ప్రభుత్వం సాధించిన విజయాలతో పాటు చేపట్టబోయే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తామన్నారు.