News October 18, 2025

జూరాల ప్రాజెక్టుకు 32,200 క్యూసెక్కుల వరద

image

ధరూర్ మండలంలోని జూరాల ప్రాజెక్టుకు శనివారం సాయంత్రం 32,200 క్యూసెక్కుల వరద వస్తోంది. విద్యుత్ ఉత్పత్తికి 19,561, నెట్టెంపాడు లిఫ్ట్‌కు 750 క్యూసెక్కులు వదులుతున్నారు. ఎడమ కాలువకు 1,030 , కుడి కాలువకు 680, ప్యార్లాల్ కెనాల్‌కు 200, భీమా లిఫ్ట్ -2కు 750 మొత్తం 22,258 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.

Similar News

News October 18, 2025

జూబ్లీహిల్స్ కోసం 40 ‘హస్త్రాలు’

image

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం కాంగ్రెస్ 40 అస్త్రాలు ప్రయోగిస్తుందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. తాజాగా నియమించిన స్టార్ క్యాంపెయినర్ల జాబితా రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. AICC స్టేట్ ఇన్‌‌ఛార్జీ, CM, డిప్యూటీ CM, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కీలక నాయకులతో కూడిన 40 మందిని ప్రచారం కోసం నియమించడం విశేషం. ఒక్క MLA స్థానం కోసం కాంగ్రెస్ ఉద్దండులు అంతా బరిలోకి దిగుతుండడం సర్వత్రా ఆసక్తిగా మారింది.

News October 18, 2025

దౌల్తాబాద్: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

image

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతిచెందాడు. దౌల్తాబాద్ మండలంలోని కొనాయపల్లికి చెందిన బక్కోళ్ల కృష్ణ(32) బైక్‌పై దౌల్తాబాద్ నుంచి గజ్వేల్ వైపు వెళ్తున్నాడు. ఈ క్రమంలో శేర్‌పల్లి బందారం గ్రామ పంచాయతీ పరిధిలోని నర్సంపేట సమీపంలో మొండిచింత వద్ద బైక్ అదుపుతప్పి కిందపడ్డాడు. ఈ ప్రమాదంలో కృష్ణ తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.