News October 27, 2025
జూరాల ప్రాజెక్టు తాజా నీటి వివరాలు

జూరాల ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 9.275 టీఎంసీలుగా ఉందని ప్రాజెక్టు అధికారి వెంకటేష్ తెలిపారు. ఇన్ ఫ్లో 25 వేల క్యూసెక్కులు కాగా, పవర్ హౌస్‌లకు 23,558 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మొత్తం అవుట్ ఫ్లో 23,105 క్యూసెక్కులుగా ఉందన్నారు. వరద ప్రవాహం తగ్గడంతో అధికారులు అన్ని గేట్లను నిలుపుదల చేశారు.
Similar News
News October 27, 2025
HYD: ఆధార్ బయోమెట్రిక్‌కు పెరుగుతున్న డిమాండ్

HYDలో ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ డిమాండ్ పెరుగుతోంది. UIDAI మైత్రివనం స్టేట్ టీం అధికారులు తెలిపినట్లుగా ఈ ప్రక్రియ సుమారు 15MINలో పూర్తవుతుంది. ప్రజలు ముందుగానే బుక్ చేసుకోవడం ద్వారా వేగంగా సేవలు పొందొచ్చని సూచించారు. నగరంలోని అనేక కేంద్రాలు దీని కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. స్థానిక కేంద్రాల్లో పరిష్కారం దొరకకపోతే మైత్రివనం ఆఫీస్ రావాలన్నారు.
News October 27, 2025
నగరంలో ఉ‘సిరి’కి భారీ డిమాండ్

నగరంలో చాలా ప్రాంతంలో ఉసిరికాయలకు చాలా డిమాండ్ పెరిగింది. కార్తీకమాసం ప్రారంభం అవడంతో కొనుగోళ్లు పెరిగాయి. దేవాలయాల్లో విష్ణువు, శివుడి వద్ద ఉసిరి దీపాలు వెలిగించడానికి మహిళలు, యువతులు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. వనస్థలిపురం రైతుబజారులో 250గ్రా. ఉసిరి రూ.30- ₹50 అమ్ముతున్నారు. కాయ, ఆకులు గల ఉసిరి కొమ్మను రూ.50- ₹80 వరకు విక్రయిస్తున్నారు. ధరలు మరింత పెరుగుతాయని వ్యాపారులు చెబుతున్నారు.
News October 27, 2025
విశాఖలో పలుచోట్ల నేలకొరుగుతున్న చెట్లు

మొంథా తుపాన్ నేపథ్యంలో వర్షంతో పాటు ఈదురు గాలులు బలంగా ఇస్తున్నాయి. నగరంలోని పలు ప్రాంతాలలో సోమవారం ఉదయం నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. రామాటాకీస్, కైలాసపురం ఎన్జీవో కాలనీ, రైల్వే క్వార్టర్స్, కంచరపాలెం తదితర ప్రాంతాలలో చెట్లు నేలకొరిగాయి. అడపా దడపా భారీ వర్షం కూడా కురుస్తోంది. సహాయక చర్యల్లో అధికార యంత్రాంగం నిమగ్నమయ్యింది.


