News February 28, 2025

జూరాల ప్రాజెక్టు వద్ద ఇదీ పరిస్థితి..!

image

ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ప్రధాన రోడ్డుపై గ్రౌటింగ్ హోల్స్‌లు బోరుబావిని తలపిస్తున్నాయి. డ్యామ్‌ లీకేజీలను అరికట్టేందుకు సిమెంట్ గ్రౌటింగ్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం హోల్స్ బోరు బావిని తలపించేలా కనిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్టును చూసేందుకు ప్రయాణికులు, సందర్శకులు వస్తుంటారు. గద్వాల్-ఆత్మకూరుకు ఇదే ప్రధాన రహదారి. ఈ ప్రమాదాలు జగరక ముందే పీజేపీ అధికారులు మూతలు ఏర్పాటు చేయాలని వాహనదారులు కోరుతున్నారు.

Similar News

News February 28, 2025

70 సైకిళ్లు సిద్ధం.. తీసుకెళ్లేందుకు మీరు సిద్ధమా!

image

జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులు మంచి ఫలితాలు సాధించిన వారికి 70 సైకిళ్లు ఇచ్చేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని కలెక్టర్ హనుమంతరావు అన్నారు. పదో తరగతి తుది ఫలితాల్లో విద్యార్థులు ఉత్తమ మార్కులు సాధించి సైకిళ్లను పొందాలన్నారు. 192 ప్రభుత్వ విద్యాసంస్థల్లో పదో తరగతి చదువుతున్న 6074 మంది విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో చదవాలన్నారు.

News February 28, 2025

పరిశ్రమల ఏర్పాటుకు జాప్యం లేకుండా అనుమతులు: జేసీ

image

జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు జాప్యం లేకుండా అనుమతులను మంజూరు చేయాలని జేసీ కార్తీక్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఉదయం కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో జిల్లా పరిశ్రమలు ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు వచ్చిన దరఖాస్తుల పురోగతి, పిఎంఈజిపి రుణాల మంజూరు, క్లస్టర్‌ డెవలప్‌మెంటు ప్రోగ్రాం  అంశాలను జిల్లా పరిశ్రమల శాఖ జిఎం ప్రసాద్‌ వివరించారు.

News February 28, 2025

మంత్రి తుమ్మల అనుచరుడు గాదె సత్యం మృతి

image

సత్తుపల్లి మాజీ జడ్పీటీసీ సభ్యులు, సీనియర్ రాజకీయ నాయకులు గాదె సత్యనారాయణ (76) ఊపిరితిత్తుల వ్యాధితో శుక్రవారం హైదరాబాదులో చికిత్స పొందుతూ మృతి చెందారు. రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రధాన అనుచరుడిగా మూడున్నర దశాబ్దాల పాటు రాజకీయాలలో సేవలందించారు. ఆయన మృతిపట్ల మంత్రి తుమ్మల, ఎమ్మెల్యే డా. రాగమయి దయానంద్, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, ఆయా పార్టీల నాయకులు, ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

error: Content is protected !!