News December 20, 2025
జూలపల్లి: తమ్ముడు ఉప సర్పంచ్.. అక్క వార్డ్ మెంబర్

జూలపల్లి మండలం కుమ్మరికుంట గ్రామంలో ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో విశేష ఫలితం వెలువడింది. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అభ్యర్థులు ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యారు. ఆవుల శ్రీనివాస్ యాదవ్ వార్డు మెంబర్‌గా గెలిచి ఉప సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. ఆయన సోదరి తమ్మడవేణి రాధ మరో వార్డు మెంబర్‌గా విజయం సాధించారు. తమ్ముడు ఉప సర్పంచ్‌గా, అక్క వార్డు మెంబర్‌గా ఎన్నిక కావడంపై గ్రామంలో ఆనంద వాతావరణం నెలకొంది.
Similar News
News December 20, 2025
లబ్ధిదారులకు మంచి సేవలందించాలి: కలెక్టర్

అంగన్వాడీ కేంద్రాల ద్వారా లబ్ధిదారులకు మంచి సేవలు అందించాలని కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అన్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ జిల్లా స్థాయి కమిటీ సమావేశాన్ని శనివారం బాపట్ల కలెక్టరేట్‌లో నిర్వహించారు. అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాల పనితీరు బాగుండాలని కలెక్టర్ చెప్పారు. లబ్ధిదారులకు మెరుగైన సేవలు అందేలా కృషి చేయాలన్నారు. అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాల పనితీరు ఆధారంగా వారికి ప్రాధాన్యత ఉంటుందన్నారు.
News December 20, 2025
సౌత్ కొరియాను వేధిస్తున్న బట్టతల సమస్య

సౌత్ కొరియాలో బట్టతల ఓ సమస్యగా మారింది. గతేడాది 2.40 లక్షల మంది జుట్టు రాలుతోందని ఆసుపత్రులను ఆశ్రయిస్తే వారిలో 40% యువతే ఉండటం గమనార్హం. కాగా దీని వైద్య ఖర్చులను ప్రభుత్వం భరిస్తుందన్న అధ్యక్షుడు లీ సూచన వివాదంగా మారింది. తీవ్రమైన వ్యాధ్యులను వదిలి దీనికి నిధులు వెచ్చించడమేమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. అయితే బట్టతలతో యువత ఆత్మస్థైర్యం సన్నగిల్లుతోందని, ఇది ప్రగతికి సమస్య అంటున్న వారూ ఉన్నారు.
News December 20, 2025
మానేరు నదిపై రూ.203 కోట్లతో హై లెవెల్ వంతెన

కాటారం-మంథని మండలాల సరిహద్దులో ప్రవహిస్తున్న మానేరు నదిపై హై లెవెల్ వంతెన, రెండు వైపులా అప్రోచ్ రోడ్డు నిర్మాణానికి రూ.203 కోట్లు మంజూరైనట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఆరెంద మీదుగా దామెరకుంట వరకు 1 కి.మీ. 120 మీటర్ల పొడవు, 13 మీటర్ల వెడల్పుతో హై లెవెల్ బ్రిడ్జి, వెంకటాపూర్ నుంచి దామెరకుంట రోడ్డు వరకు రెండు వైపులా 9.530Mtrs అప్రోచ్ రోడ్డు నిర్మించనున్నట్లు పేర్కొన్నారు.


