News December 16, 2025

‘జూలూరుపాడు పంచాయతీకి ఎన్నికలు లేవు’

image

చివరి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మొత్తం 156 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. అయితే ఒక్క జూలూరుపాడు గ్రామ పంచాయతీకి సంబంధించి కోర్టు కేసు పెండింగ్‌లో ఉన్న కారణంగా ఆ గ్రామానికి ఎన్నికల నోటిఫికేషన్ వెలువడలేదని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తెలిపారు. మొత్తం స్థానాల్లో 10 ఏకగ్రీవంగా ఖరారయ్యాయని, మిగిలిన 145 సర్పంచ్ స్థానాలకు ఈ నెల 17న ఎన్నికలు ఉంటాయని కలెక్టర్ చెప్పారు.

Similar News

News December 19, 2025

క్లెయిమ్ చేయని ఆస్తులపై 20న అవగాహన శిబిరం

image

క్లెయిమ్ చేసుకోని ఆర్థికపరమైన ఆస్తుల కోసం డిసెంబర్ 20న నల్గొండ కలెక్టరేట్ కార్యాలయ ఉదయాదిత్య భవనంలో ఉమ్మడి శిబిరం నిర్వహిస్తున్నారు. క్లెయిమ్ చేసుకోని ఆర్థికపరమైన ఆస్తుల వాస్తవ యజమానులు వాటిని పొందేందుకు.. బ్యాంకు శాఖ, భీమా సంస్థ, మ్యూచువల్ ఫండ్ సంస్థ, శిబిరంలోని స్టాక్ బ్రోకరేజీ సంస్థ, ఆన్‌లైన్ ద్వారా స్టాక్ బ్రోకర్‌లలో దేనినైనా సంప్రదించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు తెలిపారు.

News December 19, 2025

నిన్ను నువ్వు ఉత్తమంగా మార్చుకోవాలంటే?

image

ఎవరైనా మనల్ని ఆలస్యంగా ఆహ్వానిస్తే తిరస్కరించడం, పిలవని చోటుకు వెళ్లకపోవడం ఆత్మగౌరవాన్ని పెంచుతుంది. ఎదుటివారు మనల్ని మర్చిపోతే వారిని వదిలేయాలి. మనల్ని వాడుకోవాలని చూస్తే హద్దులు పెట్టుకోవాలి. మోసపోయినప్పుడు క్షమించి ముందుకు సాగాలి. అవమానించిన వారికి విజయంతో జవాబు చెప్పాలి. మన విలువ గుర్తించని వారికి దూరం ఉండాలి. తక్కువ అంచనా వేసేవారికి ఫలితాలతో సమాధానమివ్వాలి. తద్వారా గుర్తింపు లభిస్తుంది.

News December 19, 2025

రాష్ట్రాభివృద్ధికి అడ్డుపడుతున్న జగన్: మంత్రి లోకేశ్

image

AP: టీసీఎస్, కాగ్నిజెంట్, సత్వా‌తోపాటు రహేజా ఐటీ పార్క్‌కు వ్యతిరేకంగా వైసీపీ పిల్స్ దాఖలు చేసిందని మంత్రి లోకేశ్ ఆరోపించారు. ఈ ప్రాజెక్టుల ద్వారా లక్షకు పైగా ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. యువత భవిష్యత్తు పట్ల జగన్‌కు ఎందుకింత ద్వేషం అని Xలో ప్రశ్నించారు. రాష్ట్ర అభివృద్ధికి ప్రతి అడుగులోనూ అడ్డుపడుతున్నారని మండిపడ్డారు.