News January 26, 2025

జెండాను ఎగరవేసిన పార్వతీపురం ఎస్పీ 

image

పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ కార్యాలయంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఆదివారం నిర్వహించారు. మువ్వన్నెల జెండాను ఎస్పీ ఎస్.వి మాధవ్ రెడ్డి ఆవిష్కరించారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఎందరో వీరుల త్యాగఫలితంతో మనకు స్వాతంత్రం వచ్చిందని, ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం కలిగిన దేశం మనదని అన్నారు.

Similar News

News December 21, 2025

60 మంది బాలబాలికలకు క్రికెట్ మ్యాచ్ పాస్‌లు ఏర్పాటు చేసి సీపీ

image

విశాఖలో ఆదివారం జరుగుతున్న ఇండియా- శ్రీలంక క్రికెట్ మ్యాచ్‌ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు 60 మంది స్వచ్చంధ సంస్థల బాలబాలికలకు విశాఖ సీపీ శంఖబ్రత భాగ్చి అవకాశం కల్పించారు. స్వచ్చంధ సంస్థలలో ఉంటున్న 60 మంది బాలబాలికలకు క్రికెట్ మ్యాచ్ పాస్‌లు ఏర్పాటు చేశారు. సీపీ బాలబాలికలను స్టేడియంలో కలిసి ముచ్చటించారు. అనంతరం వారితో కలిసి ఫోటోలు దిగారు.

News December 21, 2025

బిగ్‌బాస్ ఫినాలే.. ఇద్దరే మిగిలారు

image

తెలుగు బిగ్‌బాస్ సీజన్-9 గ్రాండ్ ఫినాలే కొనసాగుతోంది. టాప్-3 నుంచి డెమాన్ పవన్ ఎలిమినేట్ అయ్యారు. హీరో రవితేజ ఆఫర్ చేసిన రూ.15 లక్షలు తీసుకొని హౌస్ నుంచి బయటకు వచ్చారు. ఇప్పటికే సంజన, ఇమ్మాన్యుయేల్ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. దీంతో టాప్-2లో కళ్యాణ్, తనూజ నిలిచారు. కాసేపట్లో విన్నర్ ఎవరో తేలనుంది.

News December 21, 2025

కోర్టు తీర్పులను విస్మరిస్తోన్న ప్రభుత్వం: షియా ముస్లిం కౌన్సిల్

image

సుప్రీం, హైకోర్టుల స్పష్టమైన తీర్పులున్నా షియా ముస్లింల హక్కులను ప్రభుత్వం విస్మరిస్తోందని ఆ కౌన్సిల్ మండిపడింది. గవర్నర్ కోటా(సామాజిక సేవ)లో MLC పదవితో పాటు అవసరమైన సౌకర్యాలు వెంటనే కల్పించాలని డిమాండ్ చేసింది. లక్డీకాపూల్‌లో జరిగిన సమావేశంలో SC మే 26, హైకోర్టు DEC 11 తీర్పులను ప్రస్తావిస్తూ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగట్టింది. కోర్టు ఆదేశాలు అమలు చేయకపోతే ధిక్కరణ చర్యలు తప్పవని హెచ్చరించింది.