News February 12, 2025

జేఈఈలో జిల్లా విద్యార్థుల ప్రతిభ

image

జేఈఈ మెయిన్ సెషన్-1లో అనంతపురం, సత్యసాయి జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. అనంతపురానికి చెందిన నితిన్ అగ్నిహోత్రి 99.99 పర్సంటైల్, గాండ్లపెంట మండలం సోమామాజులపల్లికి చెందిన ఓం కిరణ్ 99.91, అనంతపురం అశోక్ నగర్‌కు చెందిన అసిఫ్ 99.48, అనంతపురానికి చెందిన భావ, విశాల్ 99.43, 99.36 పర్సంటైల్‌తో సత్తా చాటారు.

Similar News

News February 12, 2025

2కె పరుగును ప్రారంభించిన వరంగల్ సీపీ

image

డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్స్ యూనియన్(టీఎస్ జేయూ) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 2కె పరుగును వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ప్రారంభించారు. నగర ప్రముఖులు, విద్యార్థులు, వైద్య విద్యార్థులు పాల్గొన్న ఈ పరుగు ఈరోజు ఉదయం వరంగల్ పోచమ్మ మైదానం నుంచి ప్రారంభమై కాకతీయ వైద్య కళాశాల వద్ద ముగిసింది. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ.. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు.

News February 12, 2025

రేపల్లెలో విషాదం.. తల్లి కుమారుడు ఆత్మహత్య

image

రేపల్లె పట్టణంలో బుధవారం విషాదకర ఘటన చోటు చేసుకుంది. పట్టణంలోని నాలుగో వార్డ్‌కు చెందిన వెల్లటూరు రాజకుమారి (55), ఆమె కుమారుడు నాగేంద్ర (26) బలవన్మరణానికి పాల్పడ్డారు. నాగేంద్ర విగతజీవిగా మంచంపై పడి ఉండగా, రాజకుమారి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వీరి ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనా స్థలానికి చేరుకున్న రేపల్లె పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News February 12, 2025

తూ.గో: వండిన చికెన్‌నే తినాలి

image

తూ.గో జిల్లా పెరవలి మండలంలో కోళ్లకు బర్డ్ ఫ్లూ నిర్ధారణ వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో చికెన్ తినేందుకు ప్రజలు భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో వండిన చికెన్ మాత్రమే తినాలని వైద్యులు సూచిస్తున్నారు. 75 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వరకూ ఉడకపెట్టాలన్నారు. చికెన్, గుడ్లు చేతితో తాకితే శుభ్రంగా కడుక్కోవాలని సూచిస్తున్నారు. ఎవరికైనా జ్వరం, తలపోటు, జలుబు లక్షణాలు వస్తే వైద్య సిబ్బందికి సమాచారం అందిచాలన్నారు.

error: Content is protected !!