News April 20, 2025
జేఈఈలో 299వ ర్యాంక్ సాధించిన సిద్దిపేట బిడ్డ

సిద్దిపేట జిల్లా నంగునూర్ మండలం మగ్ధుంపూర్‌కు చెందిన అచ్చిన రాకేశ్ జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో సత్తా చాటాడు. ఆల్ ఇండియా స్థాయిలో 299వ ర్యాంక్ సాధించడంతో తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేవు. దీంతో రాకేశ్‌కు గ్రామస్థులతో పాటు, బంధువులు, మిత్రులు అభినందనలు తెలుపుతున్నారు.
Similar News
News April 20, 2025
కుంభమేళాను రాజకీయంగా వాడుకున్నారు: అఖిలేశ్ యాదవ్

యూపీలో జరిగిన మహాకుంభమేళాను సీఎం యోగి ఆదిత్యనాథ్ రాజకీయ కుంభ్‌గా మార్చారని SPచీఫ్ అఖిలేశ్ యాదవ్ విమర్శించారు. బీజేపీ తదుపరి ప్రధాన మంత్రి అభ్యర్థిగా యోగిని ప్రకటించడానికి కుంభమేళాను రాజకీయంగా వాడుకునే ప్లాన్ చేశారన్నారు. ఆ సమయంలో యోగిని PM అభ్యర్థిగా ప్రకటిస్తారని ప్రచారం జరిగిందన్నారు. దేశంలో ఎక్కడ అల్లర్లు జరిగినా దాని వెనక బీజేపీ పాత్ర ఉంటుందని అఖిలేశ్ యాదవ్ ఆరోపించారు.
News April 20, 2025
GDK: రోడ్డు ప్రమాదంలో మూడేళ్ల బాలుడు దుర్మరణం

గోదావరిఖని గంగానగర్ వద్ద ఆడుకోవడానికి రోడ్డు పైకి వచ్చిన మూడేళ్ల పులిపాక శివరాజ్ కుమార్‌ను అతి వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో శివరాజ్ కుమార్‌కు తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుని తండ్రి రమేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వన్ టౌన్ SIభూమేశ్ తెలిపారు. కారు, డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నామన్నారు.
News April 20, 2025
IPL: RCB ఘన విజయం

పంజాబ్ కింగ్స్‌పై ముల్లాన్‌పూర్‌లో జరుగుతున్న మ్యాచ్లో ఆర్సీబీ ఘన విజయం సాధించింది. 158 పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. విరాట్(73*), పడిక్కల్(61) అర్ధ సెంచరీలతో రాణించారు. PBKS బౌలర్లలో అర్షదీప్, చాహల్, బ్రార్ తలో వికెట్ దక్కించుకున్నారు.