News February 13, 2025

జేఎన్టీయూ ఇన్‌ఛార్జ్ వీసీని కలిసిన TCS అధికారులు

image

అనంతపురం జేఎన్టీయూ విశ్వవిద్యాలయంలో బుధవారం ఇన్‌ఛార్జ్ వీసీ సుదర్శన రావును TCS అధికారులు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ‘Corporate Social responsibility’ కింద యూనివర్సిటీ పరిధిలోని విద్యార్థులకు ఉపయోగపడే స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రాంల గురించి ఇన్‌ఛార్జ్ వీసీతో కలిసి చర్చించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ కృష్ణయ్య, యూనివర్సిటీ డైరెక్టర్లు సత్యనారాయణ, దుర్గా ప్రసాద్ పాల్గొన్నారు.

Similar News

News August 7, 2025

స్పెషల్ డ్రైవ్.. 146 కేసులు నమోదు

image

డ్రంకన్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్‌లపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించినట్లు జిల్లా ఎస్పీ జగదీశ్ వెల్లడించారు. అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదాల నియంత్రణే లక్ష్యంగా ఈ డ్రైవ్ చేపట్టినట్లు తెలిపారు. ఈ క్రమంలో జిల్లాలో తనిఖీలు నిర్వహించి 53 డ్రంకన్ డ్రైవ్ కేసులు, 93 ఓపెన్ డ్రింకింగ్ కేసులు నమోదు చేశామని పేర్కొన్నారు. ఆగస్టు 10 వరకు జిల్లాలో డ్రంకన్ డ్రైవ్‌పై స్పెషల్ డ్రైవ్ కొనసాగుతుందని వెల్లడించారు.

News August 7, 2025

నంబర్ బ్లాక్ లిస్టులో పెట్టాడని మహిళ సూసైడ్

image

గుంతకల్లు సోఫియా వీధికి చెందిన షమీం భాను(35) తన భర్త ఫోన్ లిఫ్ట్ చేయలేదని, బ్లాక్ లిస్టులో పెట్టాడని మనస్తాపంతో పురుగుమందు తాగి బుధవారం ఆత్మహత్య చేసుకుంది. భాను మొదటి భర్తకు విడాకులు ఇచ్చి గుంతకల్లు సచివాలయ వీఆర్ఓ మహమ్మద్ వలిని గతేడాది వివాహం చేసుకుంది. ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. ఈ క్రమంలో బుధవారం తన నంబర్ బ్లాక్ లిస్టులో పెట్టడంతో ఆత్మహత్యకు ప్రయత్నించింది. అనంతపురం తరలిస్తుండగా మృతిచెందింది.

News August 7, 2025

రైతు కళ్లలో కారం చల్లి రూ.30 వేల పెన్షన్ డబ్బు చోరీ

image

వృద్ధ రైతు కళ్లలో కారం పొడి చల్లి రూ.30 వేలు చోరీ చేసిన ఘటన బ్రహ్మసముద్రం మండలం మాముడూరులో బుధవారం చోటుచేసుకుంది. పొలంలో ఉండగా గుర్తు తెలియని దుండగులు కళ్లలో కారం పొడి చల్లి తన వద్ద ఉన్న రూ.30 వేలు చోరీ చేశారని బాధిత రైతు భూతప్ప తెలిపారు. నెలనెలా పోగేసుకున్న పింఛన్ డబ్బులు మొత్తం దోచుకెల్లారని వాపోయారు. ఘటనపై స్థానిక పోలీసు స్టేషన్‌లో బాధితుడు ఫిర్యాదు చేశారు.