News February 18, 2026
జైత్రయాత్రతో చరిత్రలో నిలిచిన జిల్లా జగిత్యాల

ఉద్యమం అనగానే గుర్తుకొచ్చే జిల్లా జగిత్యాల. జగిత్యాల జైత్రయాత్రతో చరిత్రలో నిలిచిన ఈ జిల్లా 2016లో ఉమ్మడి కరీంనగర్ నుంచి విడిపోయి స్వతంత్రంగా ఏర్పడింది. 17వ శతాబ్దంలో జగదేవుడు పాలించిన నేపథ్యంలో ఈ ప్రాంతాన్ని ఆయన పేరుతో జగిత్యాలగా పిలుస్తారు. వెల్గటూర్ మండలంలోని కోటిలింగాల.. శాతవాహనుల తొలి రాజధానిగా ప్రసిద్ధి. జిల్లాలో వ్యవసాయం ప్రధాన వృత్తి కాగా, మొక్కజొన్న, వరి పంటలు ఎక్కువగా సాగు అవుతున్నాయి.
Similar News
News February 19, 2026
మారికవలసలో యువకుడి ఆత్మహత్య

మధురవాడలోని పి.ఎమ్.పాలెం పోలీస్ స్టేషన్ పరిధి మారికవలస రాజీవ్ గృహకల్ప కాలనీలో విషాదం చోటుచేసుకుంది. కాలనీలో బ్లాక్ నంబర్ 88లో నివాసముంటున్న పీల శివ (19) బుధవారం తన గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
News February 19, 2026
పాలమూరు: వీడిన హత్య కేసు మిస్టరీ.. ముగ్గురి అరెస్ట్

గత నెల 25న ఉండవెల్లి మండలం కంచుపాడులో జరిగిన ఈడిగ కృష్ణ గౌడ్ హత్య కేసును అలంపూర్ పోలీసులు ఛేదించారు. పాత కక్షల నేపథ్యంలోనే ఈ దారుణం జరిగినట్లు సీఐ వి.ప్రదీప్ కుమార్ మీడియాకు వెల్లడించారు. కల్లు వ్యాపారం, స్థల వివాదంలో కృష్ణ గౌడ్ తనను ఊరిలో ఉండనివ్వడం లేదని పగతో శ్రీనివాస్ గౌడ్ తన స్నేహితుడు రాజు, నబీతో కలిసి హత్య చేసినట్లు దర్యాప్తులో తేలింది. ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
News February 19, 2026
దోసకాయ బంగారమాయె.. రష్యాలో కిలో రూ.355

నాలుగేళ్లుగా ఉక్రెయిన్‌తో చేస్తున్న యుద్ధం కారణంగా రష్యాలో ద్రవ్యోల్బణం పెరిగిపోయింది. దీంతో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దోసకాయలు కిలో 300 రూబల్స్(₹355) చొప్పున అమ్ముతున్నారని, కొన్నిచోట్ల 2, 3 రెట్లు ఎక్కువగా ఉన్నట్లు నెటిజన్లు వాపోతున్నారు. ప్రస్తుతం మాంసంతో సమానంగా ధర ఉంటోందని చెబుతున్నారు. దోసకాయలే ఇప్పుడు తమకు బంగారంలా మారాయని సెటైర్లు వేస్తున్నారు.


