News April 14, 2025
జైనథ్‌లో ఆరుగురు జూదరులు అరెస్ట్

జైనథ్‌లోని సావపూర్ శివారులో పేకాట ఆడుతున్న ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు సీఐ సాయినాథ్ తెలిపారు. వారి వద్ద నుంచి పేక ముక్కలు, రూ.16,830 సీజ్ చేశామన్నారు. మండలంలో ఎక్కడైనా పేకాట, మట్కా, గంజాయి వంటి అసాంఘిక కార్యకలాపాలు సాగుతున్నట్లయితే సమాచారం ఇవ్వాలని, వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని సీఐ సూచించారు.
Similar News
News February 28, 2026
ఆదిలాబాద్: ‘ఫస్ట్ ఇన్ మ్యాథ్స్’ పైలెట్ ప్రాజెక్ట్ ప్రారంభం

ఆదిలాబాద్‌లోని బాలక్ మందిర్ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ‘ఫస్ట్ ఇన్ మ్యాథ్స్’ పేరుతో వినూత్న పైలెట్ ప్రాజెక్టును కలెక్టర్ రాజర్షిషా శుక్రవారం ప్రారంభించారు. గణితం పట్ల విద్యార్థుల్లో ఉన్న భయాన్ని తొలగించి, ఆసక్తిని పెంపొందించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమన్నారు. గణితం ఒక క్లిష్టమైన విషయం కాదని, సరైన పద్ధతిలో నేర్పితే అది అత్యంత ఆసక్తికరమైన, ఉపయోగకరమైన శాస్త్రమని పేర్కొన్నారు.
News February 27, 2026
ఆదిలాబాద్: విద్యార్థినితో కలెక్టర్ చిట్ చాట్

విద్యార్థులు లెక్కలను కేవలం పరీక్షల కోసం కాకుండా, జీవిత నైపుణ్యాలుగా అభివృద్ధి చేసుకోవాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. బాలక్ మందిర్ పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులతో పాటు బల్లపై కలెక్టర్ కూర్చున్నారు. విద్యార్థినితో మాట్లాడి కాసేపు చిట్ చాట్ చేశారు. గణితం ఒక క్లిష్టమైన విషయం కాదని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ ఏఎంఓ లక్ష్మణ్, అసిస్టెంట్ ఏఎంఓ అజయ్ ఉన్నారు.
News February 27, 2026
ఆదిలాబాద్: వృత్తిపరమైన నైపుణ్యంతో పనిచేయాలి: అదనపు కలెక్టర్

క్షేత్రస్థాయిలో భూముల కొలతలు, రికార్డుల నమోదులో ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్త వహించాలని అదనపు కలెక్టర్ శ్యామలదేవి సూచించారు. ప్రజలకు జవాబుదారీగా ఉండాలన్నారు. భూ వివాదాల పరిష్కారంలో సర్వేయర్ల పాత్ర అత్యంత కీలకమని, నూతనంగా ఎంపికైన వారు వృత్తిపరమైన నైపుణ్యంతో పనిచేయాలని పేర్కొన్నారు. భూ సర్వే ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు, భూ రికార్డుల ప్రక్షాళనలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు.


