News March 13, 2025
జైనథ్: నలుగురు యువకులపై కేసు : SI

బెదిరింపులకు గురిచేసిన యువకులపై కేసు నమోదు చేసినట్లు జైనథ్ ఎస్‌ఐ పురుషోత్తం తెలిపారు. ఎస్ఐ వివరాల ప్రకారం.. ADBకు చెందిన రాకేశ్, సచిన్, కార్తీక్, సాత్వీక్‌లు ఎలాంటి అధికారం లేకుండా మంగళవారం అర్ధరాత్రి భోరజ్ చెక్‌పోస్టు వద్ద హైవేపై ఎద్దుల లారీలను అక్రమంగా అడ్డుకున్నారు. లారీ డ్రైవర్లు సందీప్ గోకులే, సాహిల్‌లను బెదిరిస్తూ, భయభ్రాంతులకు గురి చేశారన్నారు. వీరిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
Similar News
News March 14, 2025
ADB: మూడు రోజులు కొనుగోళ్లు బంద్

ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ పరిధిలో కందులు, శనగ కొనుగోళ్లను మూడు రోజుల పాటు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఆదిలాబాద్ సెంటర్ ఇన్‌ఛార్జ్ కేంద్రే పండరీ తెలిపారు. శుక్రవారం హోలీ పండుగ, ఆదివారం రావడంతో కొనుగోళ్లు నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. తిరిగి ఈ నెల 17 నుంచి కొనుగోళ్లు యథావిధిగా జరుగుతాయని వెల్లడించారు. రైతులు గమనించాలని కోరారు.
News March 14, 2025
గుడిహత్నూర్‌లో యువకుడి సూసైడ్

ఆనుమానాస్పద స్థితిలో యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన గుడిహత్నూర్‌లో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. మండల కేంద్రనికి చెందిన ఉప్పులేటి రవి గురువారం రాత్రి గ్రామ సమీపంలో చెట్టుకు ఉరేసుకొని మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చెరుకొని విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం రిమ్స్‌కు తరలించినట్లు ఎస్ఐ మహేందర్ తెలిపారు.
News March 14, 2025
ADB: 16న ఏకలవ్య పాఠశాల ప్రవేశ పరీక్ష

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 4 ప్రభుత్వ ఏకలవ్య ఆదర్శ పాఠశాలల్లో 6వ తరగతి కోసం ప్రవేశానికి ఈ నెల 16వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు RCO అగస్టీన్ అన్నారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఇంద్రవెల్లిలోని పాటగూడ, ఉట్నూర్, అసిఫాబాద్‌లోని సిర్పూర్(టి) EMRS పాఠశాలల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థులు తమ హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.