News July 22, 2024
జైనథ్: పెనుగంగా నదిలో యువకుడు గల్లంతు

జైనథ్ మండలం డొల్లార వద్ద పెనుగంగా నదిలో ఓ యువకుడు గల్లంతయ్యాడు. ఆదివారం అర్ధరాత్రి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సోమవారం గాలింపు చర్యలను చేపట్టారు. యువకుడి ఆచూకీ కోసం డీడీఆర్ఎఫ్ బృందం రంగంలోకి దిగింది. పెనుగంగా నది వద్ద విస్తృతంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. గల్లంతైన యువకుడు చాంద (టీ) కు చెందిన శివగా గుర్తించారు. గాలింపు చర్యలను ఎస్పీ గౌస్ ఆలం పరిశీలించారు. సీఐ సాయినాథ్ ఎస్సై పురుషోత్తం ఉన్నారు.
Similar News
News September 8, 2025
రేపటి లోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి: DIEO

ఆదిలాబాద్ జిల్లాలోని 13 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ముఖ గుర్తింపు హాజరు (ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్) విధానాన్ని డీఐఈఓ జాదవ్ గణేష్ కుమార్ ప్రారంభించారు. మొత్తం 6,274 మంది విద్యార్థులకు గాను 3,599 మంది (57 శాతం) మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకున్నారని తెలిపారు. మిగతా విద్యార్థులు ఈ నెల 9లోగా తప్పకుండా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఆయన సూచించారు.
News September 7, 2025
ప్రతి ఒక్కరికీ అభినందనలు: ఆదిలాబాద్ ఎస్పీ

ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా శాంతి, భక్తి వాతావరణంలో 600 మంది పోలీసులతోపాటు ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ విద్యార్థుల సహకారంతో నిమజ్జన ఉత్సవాలు విజయవంతంగా పూర్తి చేశామని ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదివారం పేర్కొన్నారు. మరోవైపు ఇందుకు పలు సంఘాలు, కమిటీలు, మండప నిర్వాహకులు, యువత సహకారం అభినందనీయమని ఆయన తెలిపారు.
News September 7, 2025
ఆదిలాబాద్: ‘బీఎస్పీతోనే బహుజనులకు రాజ్యాధికారం’

బీఎస్పీ ద్వారానే బహుజనులకు రాజ్యాధికారం సాధ్యమని బీఎస్పీ సెంట్రల్ స్టేట్ కోఆర్డినేటర్ అడ్వకేట్ నిషాని రామచంద్రం పేర్కొన్నారు. ఆదివారం పట్టణంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో బీసీలకు 43% రిజర్వేషన్ అమలు చేయడంలో బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు. బీజేపీ రాజ్యాంగ రద్దు కోసం కుట్ర చేస్తోందన్నారు. నాయకులు రవీంద్ర, జంగుబాపు, రమేశ్, జగన్మోహన్, తుకారాం తదితరులు ఉన్నారు.