News November 19, 2025
జైనథ్: 8 మంది దొంగల అరెస్ట్

ఈ నెల 14న జైనథ్‌లోని హాత్తిఘాట్ పంపుహౌస్ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. చోరీకి గురైన రూ.4.8 లక్షల సామగ్రిని రికవరీ చేశారు. మంగళవారం 12 మందిపై కేసు నమోదు చేసి, ఎనిమిది మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు. దొంగిలించిన సామగ్రి, రెండు మొబైల్ ఫోన్లు, ఒక ఆటో, రూ.7,140 నగదును స్వాధీనం చేసుకున్నారు. సామగ్రి కొనుగోలు చేసిన స్క్రాప్ దుకాణదారుడిని కూడా రిమాండ్‌కు పంపినట్లు సీఐ శ్రావణ్ కుమార్ తెలిపారు.
Similar News
News February 16, 2026
ఆదిలాబాద్ బల్దియాలో అరుదైన దృశ్యం

ఆదిలాబాద్ మున్సిపాలిటీలో పక్కపక్క వార్డుల అభ్యర్థులే అత్యున్నత పదవులను కైవసం చేసుకోవడం విశేషం. చైర్‌పర్సన్‌గా 45వ వార్డు నుంచి గెలిచిన స్వతంత్ర అభ్యర్థి బండారి అనూష, వైస్ చైర్మన్‌గా 44వ వార్డు సభ్యుడు మహమ్మద్ రోహిత్ ఎన్నికయ్యారు. వరుస సంఖ్య గల వార్డులకే చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు దక్కడంపై పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
News February 16, 2026
ఆదిలాబాద్ బల్దియాలో బీజేపీకి భంగపాటు

ఆదిలాబాద్‌లో కమలదళానికి గట్టి షాక్ తగిలింది. 21మంది కౌన్సిలర్లతో అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, ఛైర్మన్ పీఠాన్ని దక్కించుకోవడంలో బీజేపీ విఫలమైంది. స్వతంత్ర అభ్యర్థుల మద్దతుపై గంపెడు ఆశలు పెట్టుకున్న నేతలకు, చివరి నిమిషంలో వారు హ్యాండ్ ఇవ్వడంతో పీఠం చేజారిపోయింది. స్వతంత్ర అభ్యర్థికి కాంగ్రెస్, బీఆర్ఎస్ సభ్యులు మద్దతు ప్రకటించడంతో సమీకరణాలు తలకిందులయ్యాయి.
News February 16, 2026
ఆదిలాబాద్ వైస్ ఛైర్మన్‌గా ఎండీ రోహిత్

ఆదిలాబాద్ మున్సిపల్ వైస్ ఛైర్మన్‌గా 44వ వార్డు కౌన్సిలర్ ఎండీ రోహిత్ ఎన్నికయ్యారు. సోమవారం అదనపు కలెక్టర్ రాజేశ్వర్ రావు పర్యవేక్షణలో జరిగిన ఎన్నికలో రోహిత్‌కు 27 మంది కౌన్సిలర్లు మద్దతు పలికారు. ఛైర్‌పర్సన్ ఎన్నిక తరహాలోనే వైస్ ఛైర్మన్ ఎంపికలోనూ కాంగ్రెస్, బీఆర్ఎస్, స్వతంత్ర సభ్యులు ఆయనకు ఓటు వేశారు. మెజారిటీ సభ్యుల మద్దతు లభించడంతో రోహిత్ ఎన్నికైనట్లు అధికారులు అధికారికంగా ప్రకటించారు.


