News June 12, 2024
జైపూర్ అడవిలో 19 జింకలను వదిలిన అధికారులు

జైపూర్ మండల పరిధిలోని అటవీ ప్రాంతంలో బుధవారం 19 చుక్కల జింకలను అధికారులు వదిలిపెట్టారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల ప్రాంత సమీపంలోని పొలాల్లో జింకలు సంచరించడంతో రైతులు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. దీంతో అటవీ శాఖ అధికారులు చర్యలు తీసుకొని వాటిని పట్టుకొని జైపూర్ అడవిలో వదిలిపెట్టారు.
Similar News
News December 17, 2025
ఆదిలాబాద్ జిల్లాలో 54.45 శాతం నమోదు

ఆదిలాబాద్ జిల్లాలో మూడవ విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఉదయం 11 గంటల వరకు 54.45 శాతం సరాసరి ఓటింగ్ నమోదైందని జిల్లా పంచాయతీ అధికారి రమేశ్ తెలిపారు. బజార్హత్నూర్‌లో 53.57%, బోథ్ 47.73%, గుడిహత్నూర్ 58.11%, నేరడిగొండ 50.94%, సోనాల 55.56%, తలమడుగులో 61.19% నమోదైంది. ఓటర్లు చురుగ్గా పాల్గొంటున్నారు.
News December 17, 2025
గుడిహత్నూర్: స్కూటీపై వచ్చి ఓటేసిన 85 ఏళ్ల బామ్మ

గుడిహత్నూర్ మండల కేంద్రంలో ఓ 85 ఏళ్ల బామ్మ ప్రజాస్వామ్యంపై తనకున్న మక్కువను చాటుకున్నారు. వయసు భారంతో ఉన్న శారీరక ఇబ్బందులను లెక్కచేయకుండా, ఆమె స్వయంగా స్కూటీపై పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆమె స్ఫూర్తిని చూసి స్థానికులు, ఎన్నికల సిబ్బంది అభినందనలు తెలిపారు. ఓటు హక్కు ప్రాముఖ్యంపై ఆమె అందరికీ ఆదర్శంగా నిలిచారని అధికారులు పేర్కొన్నారు.
News December 17, 2025
ఆదిలాబాద్: పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్: ఎస్పీ

పోలింగ్ కేంద్రాల వద్ద ప్రజలు అనవసరంగా గుమిగూడరాదని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. కేంద్రాల వద్ద 163 బిఎన్ఎస్ఎస్ (144 సెక్షన్) అమలులో ఉంటుందన్నారు. 100 మీటర్లు, 200 మీటర్ల దూరంలో ప్రత్యేక నియమ నిబంధనలు ఉంటాయని, వాటిని తప్పక పాటించాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల్లోకి సెల్‌ఫోన్లు, వాటర్ బాటిళ్లు, ఆయుధాలు, పెన్నులు వంటి వాటికి అనుమతి లేదన్నారు. క్యూ లైన్ పద్ధతి పాటించాలని ఎస్పీ పేర్కొన్నారు.


