News April 9, 2025
జైపూర్: కారు ప్రమాదంలో మహిళ మృతి

జైపూర్ మండలంలో కారు ప్రమాదంలో మహిళ మృతి చెందినట్లు SI శ్రీధర్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. కరీంనగర్ జిల్లా ఇందుర్తికి చెందిన కిరణ్, కుటుంబీకులతో మంచిర్యాలలో ఫంక్షన్‌కు హాజరై తిరిగి ఇంటికి బయలుదేరాడు. ఇందారం వద్ద చెన్నూరు నుంచి అతివేగంగా అజాగ్రత్తగా వచ్చిన తుఫాన్ వాహనం కారును ఢీకొంది. కిరణ్ భార్య సంధ్యారాణికి తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి మరణించినట్లు నిర్ధారించారు.
Similar News
News April 17, 2025
తమన్నా ‘ఓదెల 2’ మూవీ రివ్యూ & రేటింగ్

బంధించిన ఆత్మ బయటకొచ్చి ఓదెల గ్రామాన్ని ఏం చేసిందన్నదే పార్ట్-2 కథ. దేవుడు, ఆత్మ చుట్టూ సినిమా తిరుగుతుంటుంది. తిరుపతి పాత్ర, ప్రేతాత్మను ఎదుర్కొనే నాగసాధువుగా తమన్నా, ఇంటర్వెల్, మ్యూజిక్ ఆకట్టుకుంటాయి. క్రైమ్ సన్నివేశాలు, డైలాగ్స్, క్లైమాక్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. ఊహించే సీన్లు, స్టోరీ లైన్, ఎమోషన్ లేకపోవడం, ఆకట్టుకోని సెకండాఫ్, కొన్ని పాత్రలపై ఫోకస్ లేకపోవడం మైనస్.
RATING: 2.50/5.
News April 17, 2025
కశ్మీర్ వేర్పాటువాదులకు సహాయం చేస్తాం: పాక్ ఆర్మీ చీఫ్

హిందూ-ముస్లింల మధ్య ఉన్న సంప్రదాయాలు పరస్పర వ్యతిరేకమని పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసీమ్ మునీర్ అన్నారు. ఆ కారణంగానే తమ పూర్వీకులు ఎంతో పోరాటం చేసి ప్రత్యేక దేశాన్ని సాధించారన్నారు. విదేశాల్లో ఉన్న పాక్ పౌరులనుద్దేశించి ఆర్మీ చీఫ్ ప్రసంగించారు. జమ్మూకశ్మీర్‌లో పోరాటం చేస్తున్న తమ సోదరులను ఒంటరిగా వదిలేయమని, ఈ విషయంలో చాలా స్పష్టతతో ఉన్నామని ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
News April 17, 2025
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో కలెక్టర్ కాన్ఫరెన్స్ కాల్

విజయవాడ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ గురువారం ఉచిత ఇసుక, తాగు నీటి సరఫరా, ఏంఎస్ఏంఈ సర్వే, స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. గురువారం నిర్వహించిన ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో బాపట్ల జిల్లా కలెక్టరేట్ నుంచి కలెక్టర్ జె. వెంకట మురళి, జిల్లా అధికారులు పాల్గొని ప్రస్తుత పరిస్థితులు, కార్యాచరణపై చర్చించారు.