News July 5, 2024

జైపూర్: వన మహోత్సవంలో MP, MLA, IAS

image

జైపూర్ మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన వన మహోత్సవ కార్యక్రమంలో ఎంపీ వంశీకృష్ణ, ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, జిల్లా పాలనాధికారి కుమార్ దీపక్ హాజరయ్యారు. అనంతరం మొక్కలను నాటారు. వారు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు మొక్కను నాటి ప్రకృతికి అండగా ఉండాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అటవీ శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Similar News

News July 8, 2024

మందమర్రి: బావిలో మృతదేహం కలకలం

image

మందమర్రి పట్టణంలోని దీపక్ నగర్ రైల్వే ట్రాక్ సమీపంలోని కోల్ యార్డు వద్ద బావిలో ఆదివారం యువకుని మృతదేహం గుర్తించారు. సమాచారం అందుకున్న ఎస్సై రాజశేఖర్ సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని బయటకు తీయించారు. ఎస్సై మాట్లాడుతూ.. మృతుడు దీపక్ నగర్‌కు చెందిన సూరమల్ల ప్రణయ్(30)గా గుర్తించామని తెలిపారు. కొంత కాలంగా తాగుడుకు బానిసైన అతను బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు వెల్లడించారు.

News July 8, 2024

ADB: ఆదివాసీ గ్రామాల్లో సంబురాలు

image

ఆదివాసీలు ప్రతి ఏటా ఆషాఢమాసంలో నిర్వహించే అకాడి వేడుకలను నిన్న భక్తిశ్రద్ధలతో ప్రారంభించారు. ఉమ్మడి జిల్లాలో జైనూర్, సిర్పూర్ యు, లింగాపూర్, తిర్యాణి పలు మండలాల్లోని ఆదివాసీలు అడవీకి వెళ్లి వన దైవానికి మహాపూజ చేశారు. మక్క ఘట్కతో తయారు చేసిన లడ్డూలను నైవేద్యంగా సమర్పించారు. ఊర్లోని ఆవులన్నింటినీ అడవీలో ఊరేగించారు. గ్రామస్థులంతా ఒకచోట చేరి సామూహిక వనభోజనాలు చేశారు. ఈ వేడుకలు నేటితో ముగియనున్నాయి.

News July 8, 2024

ADB ఉపాధ్యాయుడిని అభినందించిన మాజీ ఉపరాష్ట్రపతి 

image

గోండి భాషలో మహాభారత కథ రాసిన ADB జిల్లా వాఘాపూర్‌కు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు తొడసం కైలాస్‌ను మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అభినందించారు. కైలాస్ చేసిన ప్రయత్నం గురించి తెలిసి ఆనందించాను. మహాభారతాన్ని గోండి భాషలోకి అనువదించి ‘పండోక్న మహాభారత కథ’ పేరిట పుస్తకంగా తీసుకొచ్చిన ప్రయత్నం అభినందనీయమైనది. ఇంతటితో ఆగిపోకుండా భవిష్యత్ తరాలు, పెద్దల స్ఫూర్తిని అందిపుచ్చుకోవాలని X వేదికగా రాసుకొచ్చారు.