News March 12, 2025
జైపూర్: 40 నెలల్లో పవర్ ప్లాంట్ పూర్తి: సింగరేణి సీఎండీ

జైపూర్‌లోని 1200మెగావాట్ల సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం ఆవరణలో నూతనంగా 800 మెగావాట్ల అల్ట్రా సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణానికి సంబంధించి బీహెచ్ఈఎల్ సంస్థతో సింగరేణి ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ మాట్లాడారు. ఒప్పందం ప్రకారం గరిష్టంగా 4ఏళ్లలో ప్లాంట్ నిర్మాణం పూర్తవ్వాలని పేర్కొన్నారు. కానీ 40 నెలల్లోనే పూర్తిచేయాలనే లక్ష్యం పెట్టుకున్నట్లు తెలిపారు.
Similar News
News October 30, 2025
ప్రజలు అవసరం ఉంటే తప్ప బయటకు రావద్దు: భూపాలపల్లి కలెక్టర్

జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు, వరదల దృష్ట్యా ఈ నెల 30న జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటించినట్లు కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. జిల్లాలో ఫ్లడ్ కంట్రోల్ రూమ్ 9030632608ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజలు అవసరం ఉంటే తప్ప బయటకు రావద్దని, వాగులు, వంతెనలు దాటవద్దని కోరారు.
News October 30, 2025
మైనార్టీకి మంత్రి పదవి ఇస్తాం: టీపీసీసీ చీఫ్

TG: కాంగ్రెస్ సెక్యులర్ పార్టీ అని, అందుకే మైనార్టీకి మంత్రి పదవి ఇవ్వాలనుకున్నట్లు TPCC చీఫ్ మహేశ్ కుమార్ తెలిపారు. <<18140326>>మంత్రి<<>> పదవికి అజహరుద్దీన్ పేరు ఫైనల్ అయినట్లుగా తమకు ఎలాంటి సమాచారం లేదన్నారు. జూబ్లీహిల్స్‌లో మైనార్టీల మీటింగ్ కోసమే అజహరుద్దీన్ తనను కలిశారని చెప్పారు. అటు కాంగ్రెస్ ప్రభుత్వం మరో మూడు నెలల్లో కూలుతుందన్న బీజేపీ ఇక చిలుక జోస్యం చెప్పుకోవాల్సిందేనని సెటైర్లు వేశారు.
News October 30, 2025
మేడారంలో 5 సెంటీమీటర్ల వాన

తాడ్వాయి మండలం మేడారంలో భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం నుంచి ఎడతెరిపి లేకుండా పడిన వానకు 5.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ములుగులో 4.9 సెం.మీ, ఖాసీందేవిపేటలో 4 సెం.మీ, వెంకటాపూర్ 3.8 సెం.మీ, తాడ్వాయి 3.5, గోవిందరావుపేటలో 3.1 సెం.మీ వర్షం కురిసింది. వర్షం ఇలాగే కొనసాగి వరద ఉధృతి పెరిగితే లోతట్టు ప్రాంతాల ప్రజల కోసం పునరావాస కేంద్రాలను తెరవాలని అధికారులు సమాయత్తమవుతున్నారు.


