News December 27, 2025

జైలులో గోవిందమాల వేసిన చెవిరెడ్డి

image

మద్యం కేసులో అరెస్ట్ అయిన చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి 190రోజులుగా విజయవాడ జైలులో ఉన్నారు. కోర్టు అనుమతితో ఆయన శుక్రవారం గోవిందమాల స్వీకరించారు. వైకుంఠ ఏకాదశికి 7రోజుల ముందే మాల వేయడం ఆయనకు ఆనవాయితీ. జైలులోని ఆలయంలో పూజలు చేసి మాల వేశారు. చేయని తప్పుకు నిర్భందించినా శ్రీనివాసునిపై తన భక్తి చెక్కుచెదరలేదని చెవిరెడ్డి చెప్పారు.

Similar News

News February 19, 2026

తిన్న వెంటనే వాటర్ తాగొచ్చా?

image

భోజనం అయిన వెంటనే నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిది కాదని న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు. అలా చేస్తే ఎంజైమ్‌లు, జీర్ణరసాలు పలుచబడి డైజెషన్ మందగిస్తుంది. ఫలితంగా బాడీ పోషకాలను సరిగా గ్రహించుకోలేదు. అలాగే ఇన్సులిన్ లెవెల్స్‌ పెరిగి కొవ్వు పేరుకుపోతుంది. మెరుగైన జీర్ణక్రియ కోసం తినడానికి 10 నిమిషాల ముందు లేదా తిన్న అరగంట తర్వాత నీళ్లు తాగడం బెటర్. అవసరమైతే భోజనం మధ్యలో చిన్న సిప్స్ తాగొచ్చు.

News February 19, 2026

అభివృద్ధి పనులు 15 రోజుల్లో పూర్తి చేయాలి: కలెక్టర్

image

కామారెడ్డి జిల్లాలో కొనసాగుతున్న వివిధ అభివృద్ధి పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ లో అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. పెండింగ్‌లో ఉన్న గ్రామపంచాయతీ, అంగన్‌వాడీ భవనాలను 15 రోజుల్లో పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని ఆదేశించారు. నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు ఉంటాయని ఆయన తేల్చి చెప్పారు.

News February 19, 2026

‘మాదకద్రవ్యాల అరికట్టుకు కట్టుదిట్టమైన చర్యలు’

image

జిల్లాలో మాదకద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా, సాగును అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి మాదకద్రవ్య నియంత్రణ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా సరిహద్దుల్లోని చెక్‌పోస్టుల వద్ద అత్యాధునిక సాంకేతిక పరికరాలతో నిశిత తనిఖీలు నిర్వహించాలని సూచించారు.