News July 2, 2024
జైలులో పిన్నెల్లిని కలిసిన మాజీ మంత్రులు

నెల్లూరు సెంట్రల్ జైలులో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనతో మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, కాకాణి గోవర్థన్ రెడ్డి ములాఖత్ అయ్యారు. కేసు వివరాలను తెలుసుకున్నారు. మాజీ మంత్రులు మాట్లాడుతూ.. వైసీపీ కార్యకర్తలపై టీడీపీ నాయకులు విచ్చలవిడిగా దాడులు చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ కార్యకర్తలకు అండగా ఉంటామని చెప్పారు.
Similar News
News February 3, 2026
BREAKING.. కాకాణికి నోటీసులు

మాజీ మంత్రి, వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డికి పోలీసు అధికారులు నోటీసులు ఇచ్చారు. చంద్రబాబు, సోమిరెడ్డిపై కాకాణి గోవర్ధన్ రెడ్డి దుర్బషలాడారని టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. దీనిపై నెల్లూరు రూరల్, పొదలకూరు, మనుబోలులో కేసులు నమోదు అయ్యాయి. ఈ నేపథ్యంలో ఆయన ఇంటికి వెళ్లి పోలీసులు నోటీసులు అందజేశారు.
News February 3, 2026
నెల్లూరు KVR పెట్రోల్ బంకు వద్ద రోడ్డు ప్రమాదం

నెల్లూరు నగరం KVR పెట్రోల్ బంకు వద్ద అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇసుక టిప్పర్ బైక్‌ను ఢీకొనడంతో బైకుపై వెళ్తున్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు 108కి సమాచారం అందించి గాయపడిన క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారు నెల్లూరు వేదయపాలెంకు చెందిన మల్లికార్జున్, భరత్‌గా తెలుస్తుంది. అయితే ఢీకొట్టిన టిప్పర్ పరారవడం విశేషం.
News February 3, 2026
నెల్లూరు: పసికందును వదిలి వెళ్లిపోయారు

నెల్లూరు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో 3 నెలల క్రితం మగబిడ్డను వదిలి వెళ్లారు. బరువు తక్కువగా ఉన్న మగ శిశువును చిన్నపిల్లల వైద్యులే అన్నితామై సంరక్షించారు. వదిలి వెళ్లినవారు రాకపోవడంతో వారిని గుర్తించాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంచార జీవనం గడుపుతున్న రేణుక గతేడాది అక్టోబర్‌లో అల్లూరులోని ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ కాగా శిశువు బరువు తక్కువగా ఉందని తన భర్తతో వచ్చి ఆసుపత్రిలో చేరారని తెలిపారు.


