News October 2, 2025

జైలు ఒక శిక్షణాలయం వంటిది: కలెక్టర్

image

విశాఖ సెంట్రల్ జైలులో గాంధీ జయంతి ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి రాజు, కలెక్టర్ హరిందర్ ప్రసాద్, జిల్లా న్యాయ సేవల సంస్థ సెక్రటరీ సన్యాసినాయుడు హాజరై ఖైదీలతో ముచ్చటించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జైలు అనేది శిక్షణాలయం వంటిదని, ప్రతి ఒక్కరూ సోదరభావంతో నడుచుకుంటూ శాంతి, అహింసా మార్గాలలో ప్రవర్తించాలని సూచించారు.

Similar News

News October 2, 2025

విశాఖలో వర్షపాతం వివరాలు..

image

అల్పపీడనం కారణంగా విశాఖలో బుధవారం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిన్న నగరంలో నమోదైన వర్షపాతం వివరాలను అధికారులు గురువారం విడుదల చేశారు. ఆనందపురంలో 37.8 మి.మీ., భీమునిపట్నంలో 23.6, పద్మనాభంలో 21.4, పెదగంట్యాడలో 19.2, సీతమ్మధారలో 18.2, విశాఖ (రూరల్), ములగడలో 14.8, గోపాలపట్నంలో 14.2, మహారాణిపేటలో 14, పెందుర్తి, గాజువాకలో తక్కువగా 12.8, 10.2 మిల్లీమీటర్లు నమోదైందన్నారు.

News October 2, 2025

గోపాలపట్నంలో విచ్చలవిడిగా నాన్‌వెజ్ అమ్మకాలు

image

గాంధీ జయంతి సందర్భంగా నేడు మాంసాహారం దుకాణాలు తెరవొద్దని అధికారులు హెచ్చరించిన విషయం తెలిసిందే. అయితే దసరా కావడంతో గోపాలపట్నం ప్రాంతంలో చికెన్, మటన్ షాపుల యజమానులు బహిరంగంగానే గురువారం అమ్మకాలు జరుపుతున్నాయి. అధికారులు ప్రకటనలతోనే సరిపెట్టుకుంటున్నారని, చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు.

News October 2, 2025

విశాఖలో అంగన్వాడీ ఆయా పోస్టులకు దరఖాస్తుల అహ్వానం

image

విశాఖలో 53 అంగన్వాడీ ఆయా పోస్టులకు దరఖాస్తులు స్వీకరిస్తున్నామని ICDS పీడీ రామలక్ష్మి తెలిపారు. భీమునిపట్నం జోన్‌లో 11, పెందుర్తిలో 21, విశాఖలో 21 ఖాళీలు ఉన్నాయన్నారు. 7వ తరగతి పాస్ అయి 21-35 ఏళ్ల లోపు గల స్థానిక వివాహితులు ఈ పోస్టులకు అర్హులుగా పేర్కొన్నారు. దరఖాస్తులను ఈనెల 3వ తేదీ నుంచి 14వ తేదీ వరకు స్వీకరించనున్నామన్నారు.