News April 8, 2025
జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ మండల ఇన్‌ఛార్జిలు వీరే!

జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ మండల ఇన్‌ఛార్జిలను డీసీసీ అధ్యక్షుడు అశోక్ నియమించారు. ములుగు మండలం రవి, సత్తిరెడ్డి, బిక్షపతి, వెంకటాపూర్ రవిచందర్, భగవాన్ రెడ్డి, గోవిందరావుపేట కళ్యాణి, తాడ్వాయి సోమయ్య, మల్లంపల్లి రాజేందర్, ఏటూరునాగారం సురేంద్రబాబు, కన్నాయిగూడెం దేవేందర్, మంగపేట మండలం వెంకన్న, గంగారం మొగిలి, కొత్తగూడ రూప్ సింగ్, వెంకటాపురం రమేష్ బాబు, వాజేడు విక్రాంత్‌ను ఎంపిక చేశారు.
Similar News
News April 17, 2025
ప్రధాని మోదీ అధ్యక్షతన బీజేపీ కీలక సమావేశం

బీజేపీ సంస్థాగత ఎన్నికలపై ఆ పార్టీ అగ్రనేతలు PM మోదీ అధ్యక్షతన ఆయన నివాసంలో బుధవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత కీలక సమావేశం నిర్వహించారు. ఇందులో జాతీయ అధ్యక్షుడి, పలు రాష్ట్రాలకు చీఫ్‌లను ఎన్నుకునే ప్రక్రియపై చర్చించినట్లు తెలుస్తోంది. APR 20 తర్వాత ఎప్పుడైనా జాతీయ అధ్యక్షుడి ఎన్నిక ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి. అటు, రాష్ట్రాల అధ్యక్షుల పేర్లు రెండు, మూడ్రోజుల్లో ప్రకటించనున్నట్లు సమాచారం.
News April 17, 2025
సంగారెడ్డి: వైర్ల దొంగల ముఠా అరెస్ట్

నూతన వెంచర్లలో అల్యూమినియం వైర్ల దొంగల ముఠాను అరెస్టు చేసినట్లు సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. ఎస్పీ కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సదాశివపేట సీసీఎస్ పోలీసుల సంయుక్త ఆపరేషన్‌లో వైర్ల దొంగలను పట్టుకున్నారు. 9 మందిని అరెస్టు చేయగా.. వారి నుంచి రూ. 2.02 లక్షల విలువైన 778 కిలోల అల్యూమినియం ఎలక్ట్రికల్ వైర్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు.
News April 17, 2025
MNCL: ఉద్యోగాలు.. APPLY NOW

అగ్నివీర్ ఆర్మీ రిక్రూట్మెంట్ ఆన్‌లైన్ దరఖాస్తు నమోదుకు ఈనెల 25వ వరకు గడువు పొడిగించినట్లు అధికారులు తెలిపారు. ఆర్మీ రిక్రూట్మెంట్ 2025-28 సంవత్సరానికి అగ్నిపథ్ పథకం కింద అగ్నివీర్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ గడువును పొడిగించారన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు www.joinindianarmy.ac.in వెబ్‌సైట్‌లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.