News June 22, 2024

జొన్నగిరిలో వజ్రం లభ్యం

image

తుగ్గలి మండలం జొన్నగిరిలో శుక్రవారం వజ్రం లభ్యమైంది. జొన్నగిరికి చెందిన ఒక రైతు తన పొలంలో వ్యవసాయ పనులు చేసుకుంటూ ఉండగా వజ్రం దొరికింది. ఈ వజ్రాన్ని గ్రామానికే చెందిన వ్యాపారస్థుడు రూ.2.8 లక్షలకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే దాదాపు మండలంలో ఈ సంవత్సరం 40వజ్రాలకు పైగా దొరికాయి. వర్షం పడితే వజ్రాల కోసం ఇతర ప్రాంతాలకు చెందిన ప్రజలు తండోపతండాలుగా ఇక్కడికి వస్తుంటారు.

Similar News

News October 5, 2024

కృష్ణగిరిలో 48.2 మి.మీ వర్షం

image

కర్నూలు జిల్లాలో వర్షం దంచికొట్టింది. కృష్ణగిరిలో అత్యధికంగా 48.2 మి.మీ వర్షం కురిసింది. గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు 25 మండలాల్లో వాన పడింది. జిల్లాలో సగటున 12.6 మి.మీ వర్షం నమోదైంది. అత్యల్పంగా ఎమ్మిగనూరులో 2.4, చిప్పగిరి 2.0, హాలహర్విలో 1.0 మి.మీ వర్షం కురిసింది. భారీ వర్షంతో ఆదోని వ్యవసాయ మార్కెట్‌ యార్డులో వివిధ పంట దిగుబడులు తడిచిపోయాయి. నేడు మార్కెట్‌ యార్డుకు సెలవు ప్రకటించారు.

News October 5, 2024

ఆదోని వ్యవసాయ మార్కెట్‌ యార్డుకు నేడు సెలవు

image

ఆదోనిలోని స్థానిక వ్యవసాయ మార్కెట్‌ యార్డుకు శనివారం సెలవు ప్రకటించినట్లు మార్కెట్‌ యార్డు సెక్రటరీ రామ్మోహన్‌రెడ్డి తెలిపారు. ఇవాళ ఎలాంటి క్రయ, విక్రయాలు జరగవన్నారు. రెండ్రోజులుగా వర్షం కురుస్తుండగా తుఫాను ప్రభావంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. నిన్న కురిసిన వర్షానికి మార్కెట్‌కు తెచ్చిన వివిధ పంట దిగుబడులు తడిచిపోయాయని తెలిపారు.

News October 5, 2024

స్వర్ణాంధ్ర@2047 జిల్లా ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం: కలెక్టర్

image

స్వర్ణాంధ్ర @2047 ప్రణాళికలో భాగంగా రాబోయే 23 సంవత్సరాలలో నంద్యాల జిల్లా అన్ని రంగాలలో అభివృద్ధి సాధించే దిశగా ప్రణాళిక రచన సిద్ధం చేస్తున్నామని కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో స్వర్ణాంధ్ర @2047 జిల్లా దార్శనిక పత్ర ప్రణాళికపై అధికారులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, వివిధ రంగాల స్టేక్ హోల్డర్స్‌లతో జిల్ల స్థాయి సమీక్ష నిర్వహించారు.