News October 5, 2025

జొన్నవాడ బ్రిడ్జి వద్ద ఇద్దరు యువకులు గల్లంతు

image

జొన్నవాడ బ్రిడ్జి వద్ద ఇద్దరు యువకులు గల్లంతైన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. నెల్లూరు రూరల్ పెన్నా నదిలో దిగిన యువకులు పైనుంచి వస్తున్న ప్రవాహానికి కొట్టుకుపోయారు. గలంతైన వారు స్థానిక ILM డిపో ప్రాంతానికి చెందిన కోటయ్య (20), విశాల్ (21) గా గుర్తించారు. విశాల్ మృతదేహం లభ్యం కాగా.. కోటయ్య కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Similar News

News October 5, 2025

నెల్లూరు: బానిసత్వం నుంచి విముక్తి

image

నెల్లూరు(D) కాకుటూరుకు చెందిన ముగ్గురు మైనర్లకు విముక్తి లభించింది. వీళ్లను బానిసలుగా చేసుకుని పని చేయించుకుంటున్నారు. ఈక్రమంలో జిల్లా మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం పోలీసులు దాడులు చేసి వారికి విముక్తి కల్పించారు. ముత్తుకూరు పోలీస్ స్టేషన్‌లో సదరు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఆ విభాగం ఏఎస్ఐ శ్రీహరి బాబు, పోలీస్ సిబ్బంది రాంబాబు చెప్పారు. ఈ ముగ్గురిని విశ్వ జననీ చైల్డ్ హోం కేర్‌లో చేర్చారు.

News October 5, 2025

నెల్లూరు జిల్లాలో పెరుగుతున్న నేరాలు

image

మహిళలపై జరుగుతున్న నేరాల్లో నెల్లూరు జిల్లా రాష్ట్రంలో 7వస్థానంలో ఉన్నట్లు జాతీయ నేర గణాంక సంస్థ-2023 నివేదిక స్పష్టం చేస్తోంది. అత్యాచారం చేసి ఇద్దరిని హతమార్చారు. అదనపు కట్నం వేధింపులతో 6మంది చనిపోయారు. అత్తింటి వారి వేధింపులపై 507, అత్యాచారాలపై కేసులు 13, చిన్నారులపై వేధింపు కేసులు 121 నమోదయ్యాయి. 69 పోక్సో కేసులు, 585 మహిళల మిస్సింగ్ కేసులు ఫైలయ్యాయి.

News October 5, 2025

నెల్లూరు DEO హెచ్చరికలు ఇవే..!

image

హైకోర్టు ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లాలోని ప్రైవేట్ యాజమాన్య పాఠశాలల్లో ఎటువంటి టాలెంట్ టెస్ట్ నిర్వహించరాదని DEO డాక్టర్ ఆర్.బాలాజీ రావు స్పష్టం చేశారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే ఆయా పాఠశాలలపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఇప్పటికే జిల్లాలోని అన్ని ప్రైవేటు పాఠశాలల కరస్పాండెంట్లు, హెచ్ఎంలకు ఈ మేరకు ఆదేశాలు ఇచ్చామన్నారు.