News January 7, 2026

జోగి రమేశ్‌ను జైల్లో ఇబ్బంది పెడుతున్నారు: వెల్లంపల్లి

image

రాష్ట్ర ప్రజలు అందరూ ఈ అరాచక ప్రభుత్వాన్ని గమనిస్తున్నారని మాజీ మంత్రి వేల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. బుధవారం విజయవాడలోని సబ్ జైల్లో ఉన్న మాజీ మంత్రి జోగి రమేశ్‌‌తో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మాజీ మంత్రి వేల్లంపల్లి శ్రీనివాసరావు ములాఖాత్ అయ్యారు. 67 రోజులుగా బీసీ నాయకున్ని నిర్బంధించి జైల్లో నుంచి ఇబ్బందులు పెడుతున్నారని విమర్శించారు. లోకేశ్ కక్ష సాధింపు చర్యలు చేపట్టడం దుర్మార్గమన్నారు.

Similar News

News January 8, 2026

PDPL: విశ్వబ్రాహ్మణుల సమస్యలపై సీఎం దృష్టికి వినతి

image

పెద్దపల్లి జిల్లా విశ్వబ్రాహ్మణుల సమస్యల పరిష్కారానికి పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్తో కలిసి సీఎం రేవంత్ రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. అనంతరం ప్రభుత్వ ముఖ్య సలహాదారు వేం నరేందర్ రెడ్డిని కలిసి అక్రమ రికవరీలు, బంగారం ధరల పెరుగుదలతో స్వర్ణకారుల ఉపాధి సమస్యలను వివరించారు. విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటుకు కృషి చేస్తామని హామీ లభించింది.

News January 8, 2026

భూమిని కాపాడేందుకు ఈ చిన్న పని చేద్దాం!

image

మనలోని చిన్నమార్పు పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తుంది. స్వయంగా వాటర్ బాటిల్ క్యారీ చేయడం ద్వారా లక్షల కొద్దీ ప్లాస్టిక్ బాటిల్స్‌ను అరికట్టవచ్చు. ప్రపంచవ్యాప్తంగా నిమిషానికి 10లక్షలకు పైగా ప్లాస్టిక్ బాటిల్స్ విక్రయిస్తే అందులో 9% మాత్రమే రీసైక్లింగ్ అవుతాయి. మిగిలినవి సముద్రాలను, భూమిని కలుషితం చేస్తున్నాయి. అందుకే స్టీల్ లేదా మళ్లీ వాడగలిగే బాటిళ్లనే క్యారీ చేయండి. SHARE IT

News January 8, 2026

CM ఎక్కడ కూర్చుంటే అదే రాజధాని: జగన్

image

AP: రాజధాని అమరావతిని రివర్ బేసిన్‌లో నిర్మిస్తున్నారని జగన్ అన్నారు. ‘అమరావతి నిర్మాణంపై సుప్రీంకోర్టు కూడా దృష్టి పెట్టాలి. నదిలో భవనాలు కట్టేందుకు ఎవరైనా అనుమతిస్తారా? అమరావతిలో రాజధాని కట్టకూడదు. గుంటూరు-విజయవాడ మధ్య కడితే బాగుంటుంది. అసలు రాజధానే లేని చోట చంద్రబాబు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రాజ్యాంగంలో రాజధాని అనే పదమే లేదు. CM ఎక్కడ కూర్చుంటే అదే రాజధాని’ అని మీడియాతో పేర్కొన్నారు.