News January 26, 2025

జోగులాంబ అమ్మవారి సేవలో సినీ ప్రముఖులు

image

జోగులాంబ, బాల బ్రహ్మేశ్వర ఆలయాలను ఇవాళ ప్రముఖ సీనియర్ నటి అన్నపూర్ణ, పోతుగల్ సినిమా హీరో ఉభయ దర్శించుకున్నారు. వీరికి దేవస్థానం వారు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అర్చకుల చేత తీర్థప్రసాదాలు అందించి ఆలయం స్థల పురాణం వివరించారు. ఈ సందర్భంగా అన్నపూర్ణ మాట్లాడుతూ.. అమ్మవారి దర్శనం బాగా జరిగిందని తెలిపారు. అనంతరం తుంగభద్ర పుష్కర ఘాట్ నదిని వీక్షించారు.

Similar News

News February 28, 2026

భద్రాద్రి జిల్లాలో గిరిజన కుటుంబాల్లో వెలుగులు

image

భద్రాద్రి జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజన కుటుంబాల్లో వెలుగులు విరజిమ్మనున్నాయి. ఏజెన్సీలో ప్రతి గిరిజన కుటుంబానికి విద్యుత్ కనెక్షన్ ఇవ్వడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ధర్తి అభా జన్ జాతీయ గ్రామీణ ఉత్కర్ష్ అభియాన్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకంలో భాగంగా జిల్లాలోని 3,159 మంది గిరిజనుల ఇళ్లకు విద్యుత్ సరఫరా చేయనున్నారు. రూ.15.87 కోట్లతో ఇంటింటికి ఉచితంగా విద్యుత్ కనెక్షన్స్ ఇవ్వనున్నారు.

News February 28, 2026

MDK: హెల్మెట్, సీట్‌బెల్ట్ తప్పనిసరి: అదనపు ఎస్పీ

image

మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన పరేడ్‌లో అదనపు ఎస్పీ ఎస్.మహేందర్ గౌరవ వందనం స్వీకరించి సిబ్బందికి క్రమశిక్షణ, ఫిట్‌నెస్ ప్రాముఖ్యత వివరించారు. “Arrive Alive – 2026”లో భాగంగా హెల్మెట్, సీట్‌బెల్ట్ తప్పనిసరి అని, అతివేగమే ప్రమాదాలకు కారణమని చెప్పారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో సేవలందించిన సిబ్బందిని అభినందించి, యువతలో రోడ్డు భద్రత అవగాహన పెంచాలని సూచించారు.

News February 28, 2026

కలకలం: పరీక్షకు వెళ్లి బాత్రూంలోనే ఇంటర్ విద్యార్థిని గర్భస్రావం

image

TG: భద్రాద్రి జిల్లా పాల్వంచలోని ఇంటర్ పరీక్షా కేంద్రంలో కలకలం రేగింది. 16ఏళ్ల ఫస్టియర్ విద్యార్థిని పరీక్ష ప్రారంభమైన కాసేపటికే నొప్పులతో బాత్రూంకి వెళ్లి తిరిగి రాలేదు. అనుమానం వచ్చిన మహిళా ఇన్విజిలేటర్, సిబ్బంది వెళ్లి చూడగా బాత్రూంలోనే గర్భస్రావమైంది. ఎవరికీ తెలియకుండా మృతదేహాన్ని బేసిన్‌లో కుక్కినట్లు సమాచారం. పోలీసులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఆమె 5 నెలల గర్భవతి అని సమాచారం.