News August 28, 2025
జోగులాంబ ఆలయంలో సీల్డు టెండర్ ప్రకటన

అలంపూర్ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి దేవస్థానంలో 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వివిధ రకాల కాంట్రాక్టుల కోసం సీల్డు టెండర్లను ఆహ్వానిస్తున్నారు. టెండర్లు దాఖలు చేయడానికి చివరి తేదీ సెప్టెంబర్ 1 2025 సాయంత్రం 5 గంటలు వరకు ఉంటుంది. పూర్తి వివరాల కోసం దేవస్థానం వెబ్‌సైట్ లేదా కార్యాలయాన్ని సంప్రదించవచ్చని ఆలయ అధికారులు పేర్కొన్నారు.
Similar News
News August 28, 2025
కర్నూలు: ప్రేమికులను బెదిరించి డబ్బులు వసూలు చేసే ముఠా అరెస్ట్

కర్నూలు శివారులోని జగన్నాథ గట్టుపైకి వెళ్లే ప్రేమికులను బెదిరించి డబ్బు, చైన్లు లాక్కుంటున్న నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నగరానికి చెందిన నాగేంద్రుడు, రమేశ్, మాలిక్ బాషాలను అరెస్ట్ చేసినట్లు సీఐ విక్రమ సింహ వెల్లడించారు. ఈ నెల 19న వచ్చిన ఫిర్యాదుపై విచారణ చేసి నిందితులను అదుపులోకి తీసున్నామని చెప్పారు. వారి నుంచి రూ10,500 నగదు, కత్తి, స్కూటీ, కారు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
News August 28, 2025
చౌటకూర్: జేఎన్‌టీయూ పరీక్షలు వాయిదా

భారీ వర్షాల కారణంగా సుల్తాన్‌పూర్ జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ రేపు, ఎల్లుండి జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేసింది. విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్వవిద్యాలయ అధికారులు తెలిపారు. వాయిదా వేసిన పరీక్షల రీషెడ్యూల్ వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని వారు వెల్లడించారు.
News August 28, 2025
US సాఫ్ట్ డ్రింక్స్ బహిష్కరిద్దామంటూ నెట్టింట చర్చ

టారిఫ్స్ పెంచి భారత్‌ను ఇబ్బంది పెడుతోన్న అమెరికాను ఆర్థికంగా దెబ్బకొట్టాలనే చర్చ నెట్టింట జరుగుతోంది. ఇప్పటికే <<17536241>>LPUలో<<>> US సాఫ్ట్ డ్రింక్స్‌ను బ్యాన్ చేశారు. ఇలాంటి నిర్ణయాన్నే దేశమంతా తీసుకుని అగ్రరాజ్యానికి బుద్ధి చెప్పాలనే అభిప్రాయం వినిపిస్తోంది. స్వదేశీ ప్రొడక్ట్‌లు వాడాలని, టారిఫ్స్ తగ్గించకపోతే USకు చెందిన సోషల్ మీడియా యాప్స్, మొబైల్స్‌ను కూడా ఇదే విధంగా బహిష్కరించాలని పిలుపునిస్తున్నారు.