News January 22, 2025
జోగులాంబ: కార్మికుల పోరాటం వల్లే ధరల పెరుగుదల: సీఐటీయూ

జోగులాంబ: కార్మిక సంఘాల పోరాటాల ఫలితానికి ప్రభుత్వం సివిల్ సప్లై హమాలీలకు రేట్లు పెంచారని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు వెంకటస్వామి అన్నారు. జిల్లా కేంద్రంలో సీఐటీయూ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఆయన హాజరయ్యారు. వారం రోజులపాటు జిల్లా కేంద్రంలో కార్మికులు రిలే దీక్ష చేయడంతో ప్రభుత్వం ధరలను పెంచిందని ఆయన అన్నారు. ఆయన వెంట ఉప్పేరు నరసింహ ఉన్నారు.
Similar News
News February 24, 2026
లంచ్ బ్రేక్ అరగంటే.. ముచ్చట్లు కుదరవు.. ఉద్యోగులకు రూల్స్

TG: హైదరాబాద్ విద్యుత్ సౌధలో పని చేస్తున్న ఉద్యోగులకు కొత్త రూల్స్ పెడుతూ ట్రాన్స్‌కో ఎండీ కృష్ణభాస్కర్ ఉత్తర్వులు ఇచ్చారు. 1PM-3PM మధ్య అరగంట మాత్రమే లంచ్ బ్రేక్ ఉంటుందని తెలిపారు. డ్యూటీ సమయంలో వాకింగ్, ముచ్చట్లు పెట్టడం కుదరదని స్పష్టం చేశారు. ఎమర్జెన్సీ, ముఖ్యమైన కాల్స్‌కు మాత్రమే మొబైల్ ఫోన్ వాడాలని పేర్కొన్నారు. డ్యూటీ అవర్స్‌లో కచ్చితంగా సీట్లలో అందుబాటులో ఉండాల్సిందేనని తేల్చి చెప్పారు.
News February 24, 2026
బాచుపల్లి: ఈ చెత్తను ఎత్తుకెళ్లండయ్యా!

కొత్తగా ఏర్పడిన సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో శానిటేషన్ విభాగం కుదుటపడినట్లు లేదు. నిజాంపేట సర్కిల్‌లో చెత్త కుప్పలు రాజ్యమేలుతున్నాయి. చెత్త సేకరణ గగనమైంది. దుర్వాసన, చెత్తకుప్పల నడుమ ప్రజల రాకపోకలు సాగుతున్నాయి. పాలకులు, స్థానిక MLA చొరవ తీసుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. దోమలు, కుక్కల స్వైర విహారంతో ప్రజలు ఇరిటేట్ అవుతున్నారు. ఈ చెత్తను ఎత్తుకెళ్లండయ్యా! అంటూ గగ్గోలు పెడుతున్నారు.
News February 24, 2026
రైతులకు 392 విద్యుత్ కనెక్షన్లు జారీ: హన్మకొండ ఎస్ఈ

రైతులకు నాణ్యమైన, అంతరాయం లేని విద్యుత్ సరఫరా అందించడమే లక్ష్యంగా వ్యవసాయ విద్యుత్ సర్వీసులు గరిష్ట స్థాయిలో మంజూరు చేసినట్లు ఎన్పీడీసీఎల్ హనుమకొండ సర్కిల్ ఎస్ఈ మధుసూదన్ తెలిపారు. వరంగల్ పరిధిలో డిసెంబర్ నెల నుంచి ఇప్పటివరకు మొత్తం 392 వ్యవసాయ విద్యుత్ సర్వీసులు మంజూరు చేసినట్లు ఆయన వెల్లడించారు. పంటల కోత కాలం ముగియడంతో రైతులకు త్వరతగతిన కనెక్షన్లు జారీ చేస్తున్నామన్నారు.


