News April 8, 2025
జోగులాంబ గద్వాల జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

@రైతుల వద్ద ప్రతి గింజ కొనుగోలు చేయాలి: జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ @జిల్లా కేంద్రంలో లబ్ధిదారులకు సీఎం సహాయనిది చెక్కులు పంపిణీ చేసిన జడ్పీ మాజీ ఛైర్ పర్సన్ సరిత @డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలు తగ్గించాలి: బీఆర్ఎస్ నాయకులు నాగర్ దొడ్డి వెంకట్రాములు @రాజోలి మండల కేంద్రంలో పురుగు మందు తాగి మహిళ ఆత్మహత్య @నేడు గుజరాత్‌కు వెళ్లిన స్థానిక ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి.
Similar News
News July 5, 2025
భారత్, బంగ్లాదేశ్ వైట్ బాల్ సిరీస్ వాయిదా

భారత్, బంగ్లాదేశ్ పురుషుల క్రికెట్ జట్ల మధ్య ఈ ఏడాది ఆగస్టులో జరగాల్సిన వైట్ బాల్ సిరీస్ వాయిదా పడింది. దీనిని వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో నిర్వహించనున్నట్లు BCCI ప్రకటించింది. ఇరు దేశాల క్రికెట్ బోర్డులు దీనికి అంగీకారం తెలిపాయని పేర్కొంది. షెడ్యూల్ ప్రకారం IND, BAN మధ్య 3 వన్డేలు, 3 టీ20లు జరగాల్సి ఉంది. భద్రతా కారణాల దృష్ట్యా ఈ సిరీస్ రద్దయ్యే అవకాశం ఉందని ఇటీవల ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.
News July 5, 2025
భైంసా: ‘పిల్లల్లో సమస్యలుంటే సంప్రదించండి’

పిల్లల్లో వయసుకు తగిన విధంగా మానసికంగా, శారీరకంగా ఎదుగుదల లేనట్లయితే భైంసాలోని భవిత విద్యా వనరుల కేంద్రాన్ని సంప్రదించాలని ఉపాధ్యాయులు నరేశ్, సునీల్ సూచించారు. పిల్లల్లో వినికిడి, దృష్టి సమస్య, చదవడం, రాయడంలో సమస్యలుంటే 9908316257 నంబర్‌ను సంప్రదించాలన్నారు.శనివారం దెహగాం పాఠశాలలో ప్రత్యేక అవసరాలున్న పిల్లలను గుర్తించామని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వారికి అవసరమైన సదుపాయాలను అందిస్తామన్నారు.
News July 5, 2025
TTD బోర్డు ఎప్పుడు ఏర్పాటైందో మీకు తెలుసా..?

1841లో హిందూ మత సంస్థల్లో, ఆలయాల్లో జోక్యం చేసుకోకూడదని అప్పటి ఆంగ్ల ప్రభుత్వం చట్టం చేసింది. 1843 ఏప్రిల్ 21న తిరుమల మహంతుల నిర్వహణలోకి వెళ్లింది. 1843 జులై 16 నుంచి 1933 వరకు మహంతుల పరిపాలనలో తిరుమల ఉండేది. 1933 నుంచి 1951 వరకు కమిషనర్‌తో పాటు ఒక కమిటీతో ధర్మకర్తల మండలి ఏర్పాటు చేసేవారు. 1951 హిందూమత చట్టం ప్రకారం కమిషనర్లను ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లుగా మార్పు చేశారు. TTD తొలి ఈవో సి.అన్నారావు.