News March 18, 2025
జోగులాంబ గద్వాల జిల్లా నేటి ముఖ్య వార్తలు

@గద్వాల: ప్రశాంత వాతావరణంలో ఇంటర్మీడియట్ పరీక్షలు@ జమ్మిచెడు జమ్ములమ్మకు విశేష పూజలు.@ ఉత్తమ ఫలితాలు సాధించాలి:ఎమ్మెల్యే బండ్ల @మల్దకల్: శాశ్వత సర్వేయర్‌ను నియమించాలి.CPI @మానవపాడు:GOVT స్కూల్ పిల్లలు సత్తా చాటాలి.@ఇటిక్యాల:NREGS పనులను పరిశీలించిన అదనపు కలెక్టర్ @అయిజ: అందరూ రండి..రక్తదానం చేయండి.@వడ్డేపల్లి: పదో తరగతి విద్యార్థులు ఒత్తిడికి గురవొద్దు.@గట్టు: ఎండ.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి
Similar News
News July 7, 2025
NZB: అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా గాంధారి నరసింహారెడ్డి

నిజామాబాద్ మొదటి జిల్లా కోర్టు అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా గాంధారి నరసింహారెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలోని అనంతగిరికి చెందిన నర్సింహారెడ్డి ఇంటర్మీడియట్ విద్యను ఖిల్లా కళాశాలలో, డిగ్రీ, లా ఉస్మానియా యూనివర్సిటీలో పూర్తి చేశారు. అనంతరం నిజామాబాద్ జిల్లా కోర్టులో సుదీర్ఘకాలం న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు.
News July 7, 2025
స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

బంగారం ధరలు ఇవాళ స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై ₹540 తగ్గి ₹98,290కు చేరింది. 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర ₹500 తగ్గి ₹90,100 పలుకుతోంది. అటు వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. కేజీ సిల్వర్ రేట్ రూ.1,20,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
News July 7, 2025
నేడు భద్రాద్రి జిల్లాలో తుమ్మల పర్యటన

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోమవారం భద్రాద్రి జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు అశ్వాపురం మండలం బి.జి. కొత్తూరులో మర్లపాడు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును పరిశీలిస్తారు. 3.30 గంటలకు భద్రాచలం అంబేద్కర్ సెంటర్‌లో డివైడర్లు, సెంట్రల్ లైటింగ్ పనులకు శంకుస్థాపన చేస్తారు. సాయంత్రం 4.30 గంటలకు కొత్తగూడెం ఐడీఓసీలో నిర్వహించే సమావేశంలో పాల్గొంటారని అధికారులు తెలిపారు.