News March 17, 2025
జోగులాంబ గద్వాల జిల్లా ముఖ్య వార్తలు

జోగులాంబ :@ధరూర్ : LOC అందజేసిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల.
@ఇటిక్యాల :RTC బస్సులను నిలపాలని వినతి.
@ఉండవెల్లి : మారమునగాలలో మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్.
@రాజోలి : యాసంగి పంటలకు సాగునీటిని విడుదల చేయాలి.
@అలంపూర్ : మటన్ షాపులకు భారీగా పెరిగిన విక్రయాలు.
@ జిల్లాలో ఘనంగా పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు
@అయిజ: స్నేహితుడి వైద్యానికి ఆర్థిక సహాయం అందించారు.
@గద్వాల : ప్రజా సమస్యలను పరిష్కరించండి.సిపిఎం
Similar News
News March 17, 2025
పుకార్లకు చెక్ పెట్టేందుకు అటవీ శాఖ అధికారులు చర్యలు

తాండూరు మండలంలో పులి పిల్ల సంచరిస్తున్నట్లు వస్తున్న పుకార్లకు చెక్ పెట్టేందుకు స్థానిక అటవీ శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు ట్రాఫ్ కెమెరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. గత రెండు రోజుల క్రితం తాండూరు మండలం మల్కాపూర్ సమీపంలోని సిమెంట్ కర్మాగారం సమీపంలో పులిపిల్ల కనిపించినట్లు కార్మికులు అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు.
News March 17, 2025
భారత్ ప్రగతి అద్భుతం: బిల్‌గేట్స్

ఆరోగ్యం, వ్యవసాయం, డిజిటల్ పరివర్తనలో భారత్ అద్భుత ప్రగతి సాధించిందని బిల్‌గేట్స్ అన్నారు. భారత పర్యటనకు రానున్న నేపథ్యంలో దేశంపై ప్రశంసలు కురిపించారు. వాతావరణం, వ్యవసాయం, చీడపీడల బెడద తగ్గించడంలో ఏఐ సహాయం చేస్తుందన్నారు. గేట్స్ ఫౌండేషన్ 25వార్షికోత్సవానికి భారత్ అనువైన ప్రదేశమని తెెలిపారు. ఇండియాలో శాస్త్రవేత్తలు, అధికారులతో బిల్ గేట్స్ సమావేశమయ్యే అవకాశముంది.
News March 17, 2025
బాలానగర్: అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి

అనుమానాదస్పద స్థితిలో ఓ మహిళ మృతి చెందిన ఘటన బాలానగర్ మండలంలో ఆదివారం జరిగింది. ఎస్ఐ లెనిన్ వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన లత (34) ఈనెల 14న ఇంటి నుంచి వెళ్ళిపోయింది. కుటుంబ సభ్యులు వెతికిన ఆచూకీ లభించలేదు. ఆదివారం పెద్దయపల్లి గ్రామ శివారులో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.