News March 28, 2025
జోగులాంబ గద్వాల జిల్లా ముఖ్య వార్తలు

జోగులాంబ :✍️రాజీవ్ యువ వికాసాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కలెక్టర్ సంతోష్✍️జిల్లాలో ప్రశాంతగా పది పరీక్షలు ✍️ధరూర్ :మహిళా మృతికి కారకుడైన వ్యక్తికి జీవిత ఖైదు ✍️అలంపూర్ :ఉపాధి హామీ పథకం ఉపయోగించుకోండి ✍️గద్వాల :కరపత్రాలు విడుదల చేసిన BSP నాయకులు ✍️ఇటిక్యాల :జీవాలకు టీకాలు వేయించాలి: భువనేశ్వరి ✍️KT దొడ్డి :పెండింగ్ బిల్లులను విడుదల చేయాలి ✍️అయిజ :పాస్టర్ ప్రవీణ్ కుమార్ మృతిపై విచారణ జరపాలి.
Similar News
News July 9, 2025
వరంగల్: రేపు భద్రకాళి శాకాంబరీ ఉత్సవాలు

జిల్లాలో ప్రసిద్ధిగాంచిన భద్రకాళి మాత శాకాంబరీ ఉత్సవాలు గురువారం జరగనున్నాయి. 14 రోజుల పాటు భద్రకాళి మాత వివిధ రూపాల్లో అలంకరించి భక్తులకు దర్శనం ఇచ్చింది. చివరిరోజైన గురువారం వివిధ రకాల కూరగాయలతో శాకాంబరీ అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. శాకాంబరీ ఉత్సవాల సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు. ఉత్సవాల సందర్భంగా పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.
News July 9, 2025
లక్ష్మీ బ్యారేజీలో భారీగా వరద ప్రవాహం

మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీలో బుధవారం సాయంత్రం గోదావరికి భారీగా వరద ఉద్ధృతి పెరుగుతోంది. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో ప్రాణహిత నదికి పెద్ద ఎత్తున వరద కొనసాగుతోంది. లక్ష్మీ బ్యారేజీలో సాయంత్రం 6 గంటలకు 2,41,530 క్యూసెక్కుల వరద ప్రవాహం ఉన్నట్లు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. బుధవారం ఉదయం నుంచి గోదావరికి వరద ప్రవాహం బాగా పెరుగుతోంది.
News July 9, 2025
KNR: SRR (అటనామస్) కళాశాల డిగ్రీ సెమిస్టర్ ఫలితాల విడుదల

కరీంనగర్‌లోని SRR ప్రభుత్వ (అటనామస్) కళాశాల డిగ్రీ 2వ, 4వ, 6వ సెమిస్టర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను కళాశాల ప్రిన్సిపల్ కె.రామకృష్ణ, SU కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డి.సురేశ్ కుమార్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ శ్రీనివాస్, అధ్యాపకుల బృందంతో కలిసి బుధవారం విడుదల చేశారు. 6వ సెమిస్టర్‌తోపాటు డిగ్రీ కోర్సు ఉత్తీర్ణులైన వారు 79%, 4వ సెమిస్టర్‌లో 38%, 2వ సెమిస్టర్‌లో 30% ఉత్తీర్ణత సాధించారు.