News September 24, 2025
జోగులాంబ రైల్వే హాల్ట్ దగ్గర ప్రతి రైలు ఆగాలని ఎంపీకి వినతి

ఆలంపూర్‌లోని ఐదో శక్తిపీఠం జోగులాంబ బాల బ్రహ్మేశ్వర ఆలయాలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం జోగులాంబ రైల్వే హాల్ట్ వద్ద ప్రతి రైలు ఆగేలా చూడాలని ఆలయ పాలకమండలి కమిటీ సభ్యులు మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణకు వినతిపత్రం అందజేశారు. అదేవిధంగా, ఈ మార్గం గుండా వెళ్లే ఒక రైలుకు ‘జోగులాంబ ఎక్స్‌ప్రెస్’ అని నామకరణం చేయాలని కోరుతూ మరో వినతిపత్రాన్ని ఆమెకు సమర్పించారు.
Similar News
News September 24, 2025
తల్లి నిరాకరిస్తే.. అత్త కిడ్నీ ఇచ్చి కాపాడుకుంది!

అత్తాకోడళ్ల మధ్య గొడవలు జరగడం చూస్తుంటాం. అయితే కోడళ్లను కూతురిలా చూసుకునే అత్తలు కూడా ఉన్నారనడానికి ఈ ఘటనే నిదర్శనం. యూపీలోని ఎటాలో ఓ అత్త తన కోడలి ప్రాణాలు కాపాడటానికి తన కిడ్నీని దానం చేసి మానవత్వం చాటారు. ఆమె సొంత తల్లి కిడ్నీ ఇవ్వడానికి నిరాకరించారు. అత్త మాత్రం ‘ఆమె నాకు కోడలు కాదు, కన్న కూతురితో సమానం’ అంటూ కోడలికి కిడ్నీ ఇచ్చి కాపాడుకున్నారు.
News September 24, 2025
TU: పీహెచ్డీ ప్రవేశాలకు రేపే చివరి తేదీ

తెలంగాణ యూనివర్సిటీలో Ph.Dలో ప్రవేశాలు పొందేందుకు దరఖాస్తు చేసుకోవడానికి రేపే చివర తేదీయని టీయూ రిజిస్ట్రార్ ఆచార్య యాదగిరి తెలిపారు. ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్, బిజినెస్ మేనేజ్మెంట్, కామర్స్, సైన్స్ అండ్ కంప్యూటర్ సైన్స్, సోషల్ సైన్సెస్, లా విభాగాల్లో జాతీయ అర్హత పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులన్నారు. వివరాలకు వర్సిటీ వెబ్ సైట్ సందర్శించాలన్నారు.
News September 24, 2025
కశ్మీర్ లోయలో ఫ్యాషన్ చుక్క ఇక్రా అహ్మద్

సంప్రదాయ కట్టుబాట్లను దాటుకుని ఫ్యాషన్ డిజైనర్‌గా సత్తా చాటుతున్నారు కశ్మీర్‌కు చెందిన ఇక్రా అహ్మద్. ఆ రాష్ట్రంలో Tul Palav అనే తొలి ఆన్‌లైన్ స్టోర్‌ను నెలకొల్పి దేశ, విదేశాలకు వస్త్రాలను ఎగుమతి చేస్తున్నారు. అక్కడి సంస్కృతిని ప్రతిబింబించేలా కుర్తాలు, వెడ్డింగ్ డ్రెస్సులతో ఆకట్టుకుంటున్నారు. లోయలో అస్థిర పరిస్థితులను తట్టుకుని, పలువురికి ఉపాధి కల్పిస్తూ ఆమె ఆదర్శంగా నిలుస్తున్నారు.