News July 19, 2024
జోనల్ 4 పంచాయతీ కార్యదర్శుల బదిలీలు ప్రక్రియ పూర్తి

జోన్ 4 పరిధిలోని భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల పంచాయతీ కార్యదర్శుల బదిలీ లో ఈరోజు పూర్తయ్యాయి. హైదరాబాద్ లోని పంచాయతీ రాజ్ కమీషనర్ కార్యాలయంలో జరిగిన కౌన్సెలింగ్ లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి ఖమ్మం జిల్లాకు 10 మంది, మహబూబాబాద్ జిల్లాకు ఒకరు బదిలీపై వెళ్తున్నారు. అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు బదిలీ లో ఎవరు రావడం లేదని అధికారులు తెలియజేసారు.
Similar News
News February 21, 2026
బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ దరఖాస్తు చేసుకోండి: కలెక్టర్

ఖమ్మం జిల్లాలో 2026-27 విద్యా సంవత్సరానికి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఎంపిక కోసం గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలలు మార్చి 25లోగా దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ అనుదీప్ తెలిపారు. స్టేట్/సెంట్రల్ బోర్డు గుర్తింపు, గత ఐదేళ్లలో 7వ, 10వ తరగతుల్లో 90% పైగా ఉత్తీర్ణత, మెరుగైన సదుపాయాలు ఉండాలని స్పష్టం చేశారు. దరఖాస్తులు డిప్యూటీ డైరెక్టర్, ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యాలయంలో సమర్పించాలని సూచించారు.
News February 21, 2026
ఖమ్మం: బాలకృష్ణ, లోకేశ్‌తో మంత్రి తుమ్మల భేటీ

హైదరాబాదులో జరిగిన ఒక వివాహ వేడుకలో తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు కాసేపు కుశలప్రశ్నలు వేసుకుని, వివిధ అంశాలపై ముచ్చటించారు. వేర్వేరు రాష్ట్రాలకు చెందిన కీలక నేతలు ఒకే వేదికపై కలిసిన ఈ దృశ్యం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించింది.
News February 21, 2026
హాల్‌టికెట్లలో తప్పులుంటే సంప్రదించండి: ఖమ్మం డీఐఈఓ

ఈ నెల 25 నుంచి మార్చి 18 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతాయని డీఐఈఓ రవి బాబు తెలిపారు. హాల్‌టికెట్లలో ఏవైనా తప్పులుంటే వెంటనే కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. పరీక్షా కేంద్రాల్లోకి ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదని స్పష్టం చేస్తూ, విద్యార్థులు ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని ఆకాంక్షించారు.


