News March 28, 2024

ఝారసంగం: BRSకు బిగ్ షాక్

image

పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. సంగారెడ్డి జిల్లా ఝరాసంఘం మండలానికి చెందిన 25 గ్రామాలకు చెందిన మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, సొసైటీ ఛైర్మన్లు, పార్టీ అధ్యక్షులు, ముఖ్య నాయకులు, తదితరులు బీఆర్ఎస్‌ను వీడారు. అనంతరం జహీరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ సమక్షంలో సుమారు 200 మంది కార్యకర్తలు బీజేపీలో చేరారు.

Similar News

News October 24, 2025

భూభారతి దరఖాస్తుల పరిష్కారానికి స్పెషల్ డ్రైవ్: మెదక్ కలెక్టర్

image

భూభారతి దరఖాస్తులు వేగవంతంగా పరిష్కరించడానికి జిల్లాలో నవంబర్ 1 వరకు స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. పది రోజుల్లో సుమారుగా వెయ్యి భూభారతి దరఖాస్తులు పరిష్కరిస్తామన్నారు. ఈ డ్రైవ్‌లో భాగంగా కలెక్టర్ ఆర్డీవోలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. ప్రతిరోజు ఒక్కో తహశీల్దార్ పది ఫైల్స్ క్లియర్ చేసి ఆర్డీవోలకు పంపించాలని తెలిపారు.

News October 24, 2025

అన్ని శాఖల అధికారులు ఫైల్స్ ఈ-ఆఫీసులోనే పంపాలి: మెదక్ కలెక్టర్

image

అన్ని శాఖల అధికారులు ఫైల్స్‌ను ఈ- ఆఫీసులోనే పంపాలని మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. ఇప్పటి వరకు జిల్లాలో 2,031 ఫైల్స్‌ను ఈ-ఆఫీసులో క్లియర్ చేశామన్నారు. మెదక్ జిల్లాలో అన్ని శాఖల్లో పారదర్శకత, జవాబుదారీతనం తీసుకురావడానికి, ఫైల్స్‌ను ఎవరూ కూడా తారుమారు చేయడానికి వీలు లేకుండా ప్రతిష్ఠాత్మకంగా ఈ-ఆఫీస్ ప్రారంభించి అమలు చేస్తున్నామన్నారు.

News October 24, 2025

మెదక్‌ను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలి: ఎమ్మెల్యే

image

మెదక్ ఎమ్మెల్యే డా.మైనంపల్లి రోహిత్ రావు, కలెక్టర్ రాహుల్ రాజ్ ఆధ్వర్యంలో ఈరోజు అధికారులు సమీక్షా సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. ప్రజలకు ఇబ్బంది లేకుండా సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు. పెండింగ్ పనులు పూర్తి చేసి మెదక్‌ను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలన్నారు. ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని, రోడ్లు, కాలువలు, హాస్పిటల్, ఇళ్లు, పర్యావరణ సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు.