News September 24, 2025
టన్ను ఇసుక రూ. 1,100 కే విక్రయం: కలెక్టర్

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు తక్కువ ధరలో ఇసుక అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇసుక బజార్లను ఏర్పాటు చేసిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. గోదావరి ఇసుకను టన్నుకు రూ. 1,100 చొప్పున విక్రయిస్తున్నట్లు ఆయన చెప్పారు. కూసుమంచి, మధిర, సత్తుపల్లి, కామేపల్లి, ఖమ్మంలో ఈ ఇసుక బజార్లు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ఈ ఐదు బజార్లలో మొత్తం 5,194 మెట్రిక్ టన్నుల ఇసుకను అందుబాటులో ఉంచామని తెలిపారు.
Similar News
News September 24, 2025
డిజిటల్ అరెస్ట్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి: సీపీ

‘డిజిటల్ అరెస్ట్’ పేరుతో సైబర్ నేరగాళ్లు వీడియో కాల్స్ ద్వారా ప్రజలను భయపెట్టి డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. ఇలాంటి కాల్స్ వచ్చినప్పుడు వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930కు ఫోన్ చేయాలని లేదా cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు.
News September 23, 2025
బాణసంచా దుకాణాలకు దరఖాస్తు చేసుకోండి: సీపీ

ఖమ్మం కమిషనరేట్ పరిధిలో బాణసంచా దుకాణాలు ఏర్పాటు చేయాలనుకునే వ్యాపారులు అనుమతి పొందాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 01 సాయంత్రం లోపు ఆయా డివిజన్ల పరిధిలోని ఏసీపీ కార్యాలయాల్లో సంబంధిత పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. నిబంధనలు తప్పకుండా పాటించాలని, దరఖాస్తుతో పాటు సెల్ఫ్ అఫిడవిట్, ఆధార్ కార్డు, ఫోటో, చలానా జత చేయాలని పేర్కొన్నారు.
News September 23, 2025
ఖమ్మం: ఘోర ప్రమాదం.. ఇద్దరు యువకుల మృతి

నేలకొండపల్లి మండలంలో మంగళవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అనంతనగర్ గ్రామం సమీపంలో ఎదురెదురుగా రెండు ద్విచక్ర వాహనాలు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.