News December 15, 2025

టమాటా కాయ ఆకృతి కోల్పోవడానికి కారణం ఏమిటి?

image

టమాటా కాయలు ఆకృతిని కోల్పోయే సమస్య ఎక్కువగా కాయలో పూత చివరి వైపు కనిపిస్తుంది. పిందె కట్టే దశలో చల్లని వాతావరణం వల్ల కాయ ఆకృతి కోల్పోతుంది. పెద్ద పరిమాణం గల కాయరకాల్లో ఈ సమస్య సాధారణంగా ఉంటుంది. దీని నివారణకు కలుపు మందులు లేదా పెరుగుదలను నియంత్రించే రసాయనాలను పిచికారీ చేసేటప్పుడు జాగ్రత్త వహించాలి. టమాట పంటను మురుగు నీరు బయటకు పోయే వసతి లేని నేలల్లో పండించకూడదు.

Similar News

News December 15, 2025

ఇతిహాసాలు క్విజ్ – 97 సమాధానం

image

ఈరోజు ప్రశ్న: ఈ ఆలయంలో కొలువైన అంజన్న స్వామికి రెండు ముఖాలు ఉంటాయి. అందులో ఒకటి హనుమంతుడిది కాగా, మరొకటి నరసింహస్వామిది. మూల విరాట్టు భుజాలపై శంఖుచక్రాలు, ఛాతి మీద సీతారాముని రూపాలు కూడా కనిపిస్తాయి. ఈ ఆలయం తెలుగు రాష్ట్రాల్లోనే ఉంది.
సమాధానం: కొండగట్టు అంజన్న స్వామి.
<<-se>>#Ithihasaluquiz<<>>

News December 15, 2025

జోర్డాన్‌కు చేరుకున్న మోదీ.. ఢిల్లీలో ముగిసిన మెస్సీ టూర్

image

⋆ రెండు రోజుల పర్యటన కోసం జోర్డాన్ రాజధాని అమ్మాన్‌లో ల్యాండ్ అయిన PM మోదీ.. స్వాగతం పలికిన జోర్డాన్ పీఎం జాఫర్ హసన్.. ద్వైపాక్షిక సంబంధాలకు 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మోదీ పర్యటన
⋆ ఢిల్లీలో ముగిసిన ఫుట్‌బాల్ స్టార్ మెస్సీ పర్యటన.. అరుణ్ జైట్లీ స్టేడియంలో ఫ్యాన్స్‌ను పలకరించిన మెస్సీ.. టీమ్ ఇండియా జెర్సీలు, INDvsUSA T20 WC టికెట్లు, బ్యాట్‌ను ప్రజెంట్ చేసిన ఐసీసీ ఛైర్మన్ జైషా

News December 15, 2025

ప్రియాంకా గాంధీతో PK భేటీ.. ఏం జరగబోతోంది?

image

రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ MP ప్రియాంకా గాంధీని కలవడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. 2022లో కాంగ్రెస్‌తో విభేదాల అనంతరం మూడేళ్లకు ఈ భేటీ జరిగింది. బిహార్‌లో PKకి చెందిన జన్ సురాజ్ పార్టీతో పాటు కాంగ్రెస్‌కి కూడా దారుణ ఫలితాలు వచ్చాయి. గతంలో కాంగ్రెస్‌ను విమర్శించిన PK ఇప్పుడు పునరాలోచనలో పడ్డారా?లేదా కాంగ్రెస్ కొత్త వ్యూహానికి రెడీ అవుతోందా? అన్న సందేహాలు తలెత్తుతున్నాయి.