News January 3, 2025

టమాటా రైతులకు కాస్త ఊరట

image

పత్తికొండ టమాటా మార్కెట్‌లో టమాటా ధరలు కొంత మేర పుంజుకుంటున్నాయి. మొన్నటి వరకు 25కిలోల బాక్సు కేవలం రూ.30కి మాత్రమే అమ్ముడయ్యాయి. కూలీల ఖర్చులు కూడా రావడంలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేయగా నిన్న కొంత మేర ధర పెరగడంతో ఊరట చెందారు. కిలో గరిష్ఠంగా రూ.18 పలికింది. సరాసరి రూ.15, కనిష్ఠ ధర రూ.10తో క్రయ విక్రయాలు సాగాయి. నిన్న మార్కెట్‌కు 180 క్వింటాళ్ల టమాటా వచ్చింది.

Similar News

News January 5, 2025

15 నిమిషాల ఆలస్యం.. పరీక్షకు అనుమతించని అధికారులు

image

ఆదోని ఆర్ట్స్&సైన్స్ కళాశాలలో ఆదివారం జరిగిన రేషన్ డీలర్ల పరీక్షకు 15 నిమిషాల ఆలస్యం కారణంగా పెద్దతుంబలం గ్రామానికి చెందిన తలారి నాగేంద్రమ్మను అధికారులు అనుమతించలేదు. ఆమె తన మావయ్య చనిపోయాడని, అందువల్లే ఆలస్యమైందని అధికారులను వేడుకున్నా.. ఏమాత్రం కనికరం చూపలేదు. దీంతో ఏడాది చంటి పిల్లాడిని ఎత్తుకు నిరాశతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. అధికారులు తన పరిస్థితిని అర్థం చేసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

News January 5, 2025

నందికొట్కూరులో వైరల్ అవుతున్న నో పార్కింగ్ బోర్డు

image

నందికొట్కూరులోని ఓ మందుల దుకాణం ముందు ఏర్పాటు చేసిన ‘నో పార్కింగ్ బోర్డు’ వైరల్‌గా మారింది. ‘దుకాణాల ముందు వాహనాలు నిలుపరాదు’ అంటూ నో పార్కింగ్ బోర్డులు ఏర్పాటు చేయడం చూశాం. అయితే ఓ దుకాణం యజమాని చెప్పు గుర్తుతో బోర్డు ఏర్పాటు చేశాడు. ‘వాహనాలు నిలిపితే చెప్పుతో కొడతా’ అని అర్థం వచ్చేలా ఆ బోర్డు ఉంది.

News January 5, 2025

అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల లబ్ధి: కలెక్టర్

image

రాష్ట్ర ప్రభుత్వం విభిన్న ప్రతిభావంతుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తోందని, అర్హత గల ప్రతి ఒక్కరికీ సంక్షేమ లబ్ధి చేకూర్చడమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా కలెక్టర్ జీ.రాజకుమారి అన్నారు. శనివారం నంద్యాల కలెక్టరేట్లో లూయిస్ బ్రెయిలీ 217వ జయంతి సందర్భంగా అంతర్జాతీయ ప్రతిభావంతుల దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. తొలుత లూయిస్ బ్రెయిలీ చిత్రపటానికి కలెక్టర్ పూలమాల వేసి జ్యోతి వెలిగించి ప్రారంభించారు.