News September 7, 2025

టర్మినేట్‌ అయిన 43 మంది పునఃనియామకం

image

సింగరేణిలో జేఎంఈటీలుగా చేరి టెర్మినేట్‌ అయిన 43 మందిని తిరిగి విధుల్లోకి తీసుకునేందుకు సీఎండీ ఎన్‌.బలరాం నాయక్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో వీరంతా విధులకు గైర్హాజరవడం, ధ్రువపత్రాలను సమర్పించకపోవడం వల్ల విధుల నుంచి తొలగించడం జరిగిందన్నారు. త్రైపాక్షిక ఒప్పందంలో భాగంగా వీరిని తిరిగి తీసుకుంటున్నట్లు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, క్రమశిక్షణతో పని చేయాలని సూచించారు.

Similar News

News September 7, 2025

ఈ నెల 15న కామారెడ్డిలో కాంగ్రెస్ సభ!

image

TG: ఈ నెల 15న కామారెడ్డిలో BC డిక్లరేషన్ విజయోత్సవ సభ నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. BCలకు 42% శాతం రిజర్వేషన్ అమలు చేసేందుకు తీసుకుంటున్న చర్యలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని యోచిస్తోంది. ఈ సభకు ఖర్గే, రాహుల్ గాంధీతో పాటు పలువురు నేతలకు ఆహ్వానం పంపనున్నట్లు సమాచారం. మరోవైపు రేపు HYDలో జరిగే PCC విస్తృతస్థాయి సమావేశంలో పార్టీ బలోపేతం, స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహాలపై చర్చించనున్నారు.

News September 7, 2025

పింఛన్ రాక వృద్ధురాలి భిక్షాటన

image

నందికొట్కూరులోని తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఓ వృద్ధురాలు భిక్షాటన చేసింది. జూపాడు బంగ్లా మండలం పారుమంచాలకు చెందిన మునుపాటి మరియమ్మ భర్త ఆశీర్వాదానికి పెన్షన్ వచ్చేది. భర్త చనిపోయి 2 ఏళ్లైనా తనకు పెన్షన్ రాలేదని మరియమ్మ వాపోయింది. అధికారులు మరణ ధ్రువీకరణ పత్రంలో తప్పుగా ధ్రువీకరించడంతో తనకు పింఛన్ రావడం లేదని విలపించింది. తనకు పెన్షన్ ఇప్పించి న్యాయం చేయాలని అధికారులను వేడుకొంది.

News September 7, 2025

నేడు ఈ జిల్లాల్లో వర్షాలు: APSDMA

image

AP: వాయవ్య బంగాళాఖాతం, ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో దక్షిణ ఒడిశా- ఉత్తరాంధ్ర తీరాల మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.