News December 15, 2025

టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్‌లో ఉద్యోగాలు

image

<>టాటా<<>> ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్‌ 7 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల వారు JAN 3 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి టెన్త్, NTC, సైన్స్ గ్రాడ్యుయేట్(ఫిజిక్స్, ఇంజినీరింగ్ ఫిజిక్స్/ఎలక్ట్రానిక్స్/రేడియో ఫిజిక్స్), డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. రాత పరీక్ష, ట్రేడ్/స్కిల్ టెస్ట్ లేదా పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: www.tifr.res.in

Similar News

News March 9, 2026

APలో 1053 KM మేర ‘గ్రేట్ గ్రీన్ వాల్’

image

AP: సముద్ర కోత నివారణకు తీరం వెంబడి 5KM వెడల్పుతో 1053 KM మేర ‘గ్రేట్ గ్రీన్ వాల్’ నిర్మాణం కానుందని కేంద్రం లోక్‌సభలో పేర్కొంది. ఇందుకు సంబంధించిన ప్రణాళికను AP సిద్ధం చేసినట్లు తెలిపింది. తుఫాన్లు, సునామీల నుంచి రక్షణ, సముద్రపు కోత నివారణకు వీలవుతుందని పేర్కొంది. కాకినాడ నుంచి ఉప్పాడ వరకు రూ.323 కోట్లతో, విశాఖ తీరప్రాంతంలో రూ.200 కోట్లతో కోతను నియంత్రించడానికి DPRలు పూర్తయినట్లు వివరించింది.

News March 9, 2026

స్కూళ్లు, హాస్టళ్లలో స్టీమ్ రైస్ అన్నం

image

TG: స్కూళ్లు, హాస్టళ్లలో స్టీమ్ రైస్ అన్నాన్ని వడ్డించాలని GOVT నిర్ణయించింది. ఇప్పుడు పెడుతున్న బియ్యంతో అన్నం ముద్దగా అయి విద్యార్థులు తినడం లేదు. ప్రత్యామ్యాయంగా స్టీమ్ రైస్ అన్నాన్ని కొన్నిచోట్ల పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేయించింది. ఈ రైస్ అన్నం ముద్ద కాకపోవడంతో పాటు పోషకాలతో పొడిగా ఉండడంతో వారు ఇష్టంగా తింటున్నారు. దీంతో ఇకపై ఇవే బియ్యాన్ని అన్ని హాస్టళ్లు, స్కూళ్లకు అందించాలని ఆదేశించింది.

News March 9, 2026

యుద్ధ ప్రభావం: 7 గంటల ప్రయాణం తర్వాత ఇండిగో విమానం యూటర్న్

image

ఢిల్లీ నుంచి మాంచెస్టర్ వెళ్లాల్సిన ఇండిగో విమానం 7గంటల జర్నీ తర్వాత మధ్యలోనే వెనక్కి మళ్లింది. యుద్ధం నేపథ్యంలో మిడిల్ ఈస్ట్ ఎయిర్‌స్పేస్‌లో సడన్‌గా ఆంక్షలు విధించడమే దీనికి కారణం. ఫిబ్రవరి 28న జరిగిన దాడుల తర్వాత ఇరాన్, ఇజ్రాయెల్, ఇరాక్ వంటి దేశాలు తమ గగనతలాన్ని మూసివేశాయి. దీంతో ఆఫ్రికా రూట్‌లో వెళ్తుండగా.. అక్కడ కూడా చివరి నిమిషంలో ఆంక్షలు రావడంతో ఢిల్లీకి తిరుగు పయనమైంది.