News January 18, 2026

టాపార్డర్ ఫెయిల్.. భారత్ గెలుస్తుందా?

image

న్యూజిలాండ్‌తో 338 పరుగుల భారీ లక్ష్యఛేదనలో భారత్ తడబడుతోంది. 71 రన్స్‌కే 4 వికెట్లు కోల్పోయింది. రోహిత్ (11), గిల్ (23), శ్రేయస్ అయ్యర్ (3), కేఎల్ రాహుల్ (1) నిరాశపరిచారు. ప్రస్తుతం విరాట్ (31*), నితీశ్ కుమార్ రెడ్డి (0*) క్రీజులో ఉన్నారు. భారత్ స్కోర్ 13 ఓవర్లలో 71/4గా ఉంది. టీమ్ ఇండియా విజయానికి 222 బంతుల్లో 267 రన్స్ అవసరం. మరి ఈ మ్యాచులో ఏ టీమ్ గెలుస్తుందో కామెంట్ చేయండి.

Similar News

News February 16, 2026

నేడు అమరావతిలో బిల్ గేట్స్ పర్యటన

image

AP: టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్ గేట్స్ నేడు అమరావతికి రానున్నారు. సచివాలయంలో CM చంద్రబాబు, DyCM పవన్ కళ్యాణ్‌, మంత్రి లోకేశ్‌తో ఆయన భేటీ కానున్నారు. గేట్స్ ఫౌండేషన్ సహకారంతో కొనసాగుతున్న విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల ప్రాజెక్టులను విస్తరించడంపై చర్చలు జరపనున్నారని సమాచారం. రియల్‌టైమ్ గవర్నెన్స్ సెంటర్, సంజీవని ప్రాజెక్ట్, టెక్నాలజీ ఆధారిత వ్యవసాయ విధానాలను ఆయన పరిశీలించనున్నారు.

News February 16, 2026

ఉపవాస విరమణ ఏ సమయంలో చేయాలంటే?

image

నిన్నటి శివరాత్రి ఉపవాసాన్ని ఈరోజు సూర్యోదయం తర్వాత విరమించాలి. దీనినే ‘పారణ’ అంటారు. చతుర్దశి తిథి ముగిసేలోపు ఉపవాసం విరమించాలి. అందుకు 6.42AM – 3.10PM అనువైన సమయమని పండితులు చెబుతున్నారు. ‘స్నానాది కార్యక్రమాలు ముగించుకుని శివదర్శనం చేసాక ఆహారం తీసుకోవాలి. రాత్రంతా జాగరణ చేసిన వారు పారణ తర్వాత నిద్రపోవాలి. క్రమశిక్షణతో ఉపవాసం వదిలితే శివానుగ్రహంతో సంపూర్ణ ఆరోగ్య ఫలం లభిస్తుంది’ అంటున్నారు.

News February 16, 2026

ఉచితంగా సర్వైకల్ క్యాన్సర్‌ వ్యాక్సిన్!

image

TG: సర్వైకల్(గర్భాశయ) క్యాన్సర్‌ ముప్పు నుంచి అమ్మాయిలను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 14-15 ఏళ్ల వయసున్న 4 లక్షల మంది బాలికలకు HPV వ్యాక్సిన్‌ను త్వరలో ఉచితంగా పంపిణీ చేయనుంది. మార్కెట్లో ఈ టీకా ఒక్కో డోసు రూ.2-4 వేలు ఉండటం గమనార్హం. రాష్ట్రంలో ఏటా 4 వేల మంది ఈ క్యాన్సర్ బారిన పడుతున్నారు. దీంతో వ్యాధి రాకముందే అరికట్టేందుకు ప్రభుత్వం ఫ్రీగా వ్యాక్సిన్ వేయనుంది.