News February 15, 2025
టాప్‌లో ఎన్టీఆర్ జిల్లా

స్వచ్ఛాంధ్ర మిషన్ కార్యకలాపాల అమలులో ఎన్టీఆర్ జిల్లా రాష్ట్రంలో తొలిస్థానంలో నిలిచింది. ఈ కార్యకలాపాల నిర్వహణకు సంబంధించి 14 సూచికల ఆధారంగా జిల్లాలకు ర్యాంకులు ఇచ్చామని సీఎం చంద్రబాబు శుక్రవారం తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా ఈ జాబితాలో టాప్‌లో ఉండగా, అల్లూరి జిల్లా చివరి స్థానంలో నిలిచింది. స్వచ్ఛాంధ్ర మిషన్‌లో ప్రతి పౌరుడు భాగస్వామ్యం అయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సీఎం ఈ సందర్భంగా సూచించారు.
Similar News
News December 26, 2025
తెప్పోత్సవం ఘాట్ వద్ద ప్రత్యేక కార్యక్రమాలు

ఏరు రివర్ ఫెస్టివల్‌లో భాగంగా రేపు సాయంత్రం 4 గంటల నుంచి భద్రాచలం తెప్పోత్సవ ఘాట్ వద్ద ప్రత్యేక సాంస్కృతిక, నది హారతి కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. సుమారు 230 మంది లోకల్ యువత పాల్గొనే ఫ్లాష్ మోబ్ పెర్ఫార్మెన్స్ ప్రధాన ఆకర్షణగా ఉంటుందని పేర్కొన్నారు. యువత సృజనాత్మకతను ప్రోత్సహించడంతో పాటు, నదుల పట్ల అవగాహనను పెంపొందించే విధంగా ఉంటాయని చెప్పారు.
News December 26, 2025
లలిత్ మోదీ, మాల్యాలను వెనక్కు రప్పిస్తాం: విదేశాంగ శాఖ

₹వేల కోట్లు కొల్లగొట్టి విదేశాలకు పారిపోయిన విజయ్ మాల్యా, <<18653986>>లలిత్ మోదీలను <<>> దేశానికి రప్పించడానికి కట్టుబడి ఉన్నామని కేంద్రం పేర్కొంది. అంతర్జాతీయ చట్టాలు, విదేశీ న్యాయ చిక్కులతో వారిని రప్పించడంలో జాప్యం అవుతున్నట్లు విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మీడియాతో పేర్కొన్నారు. కాగా లండన్లో లలిత్ మోదీ, విజయ్ మాల్యా పుట్టినరోజు వేడుకల్లో చేసిన కామెంట్స్ వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే.
News December 26, 2025
భద్రాద్రి జిల్లాలో చైనా మాంజాలపై నిఘా అవసరం

సంక్రాంతి సమీపిస్తున్న తరుణంలో మార్కెట్లలో చైనా మాంజాల విక్రయాలపై పోలీసులు, అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. నిషేధం ఉన్నప్పటికీ కొంతమంది వ్యాపారులు గుట్టుచప్పుడు కాకుండా వీటిని విక్రయిస్తున్నారని చెబుతున్నారు. గతంలో కొత్తగూడెంలో ఈ మాంజాల వల్ల పలువురు వాహనదారులు, పక్షులు తీవ్ర గాయాలపాలైన ఘటనలను గుర్తు చేస్తున్నారు. పండుగ వేళ తనిఖీలు చేసి మాంజాలను సీజ్ చేయాలని కోరారు.


