News December 28, 2025
టాప్‌లో మన తిరుపతి జిల్లా..!

2024లో సైబర్ నేరాలతో రూ.12.31 కోట్ల నష్టం జరగ్గా, అందులో రూ.2.30 కోట్లు రికవరీ చేసినట్లు SP సుబ్బరాయుడు తెలిపారు. 2025లో రూ.14.45 కోట్లకు గాను రూ.3.53 కోట్లు బాధితులకు అందజేశామన్నారు. NCPR ద్వారా ఈ రికవరీ సాధ్యమైందన్నారు. MOBILE HUNT యాప్ ద్వారా 2024లో 2003, 2025లో 2485 చోరీ మొబైళ్లను స్వాధీనం చేసుకున్నారు. ‘సైబర్ మిత్ర’తో ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఫోన్ల రికవరిలో జిల్లా టాప్‌లో ఉంది.
Similar News
News December 29, 2025
‘స్పిరిట్’ నుంచి న్యూఇయర్ సర్‌ప్రైజ్?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబోలో ‘స్పిరిట్’ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఇటీవల ఫొటో షూట్ పూర్తి చేసినట్లు సినీ వర్గాలు తెలిపాయి. న్యూ ఇయర్ సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసే అవకాశం ఉందని చెప్పాయి. దీనిపై మూవీ టీమ్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. మరోవైపు ఆదివారం ‘రాజాసాబ్’ రెండో ట్రైలర్ రిలీజ్ చేస్తామని మేకర్స్ వెల్లడించారు. కానీ విడుదల కాలేదు.
News December 29, 2025
భిక్కనూర్: అన్నను చంపిన తమ్ముడి అరెస్టు

భిక్కనూర్ మండలం మోటాట్ పల్లిలో శనివారం ఎర్ర రాజు హత్యకు గురయ్యాడు. అతని తమ్ముడు శివ కుమార్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ సంపత్ కుమార్ తెలిపారు. సోదరుడు అక్రమ సంబంధం పెట్టుకోవడం వల్ల తనకు పెళ్లి సంబంధాలు రావడం లేదని చంపినట్లు నిండుతుడు ఒప్పుకొన్నుట్లు సీఐ చెప్పారు. అతన్ని రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు.
News December 29, 2025
చివరి దశలో చర్చలు.. ఏం జరుగుతుందో: ట్రంప్

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపుపై చర్చలు చివరి దశలో ఉన్నాయని, ఏం జరుగుతుందో చూడాలని US అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. కీలక చర్చల కోసం ఫ్లోరిడాకు వచ్చిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీని ఆయన ఆహ్వానించారు. 2 దేశాలు శాంతిని కోరుకుంటున్నాయని చెప్పారు. పుతిన్, జెలెన్‌స్కీ ఒప్పందం చేసుకునేందుకు రెడీగా ఉన్నారని తెలిపారు. భేటీకి ముందు ట్రంప్, పుతిన్ ఫోన్‌లో మాట్లాడారు. మీటింగ్ తర్వాతా మాట్లాడనున్నారు.


