News September 10, 2025

టాప్ గ్రేడ్ బొప్పాయి ఎగుమతి ధరలు నిర్ణయించాం: కలెక్టర్

image

సెప్టెంబర్ 10వ తేదీ నుంచి టాప్ గ్రేడ్ బొప్పాయి ఎగుమతి ధర కిలోకు రూ.8గా, సెకండ్ గ్రేడ్ బొప్పాయి కిలోకు రూ.7గా నిర్ణయించినట్లు జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి మంగళవారం వెల్లడించారు. మార్కెట్‌లో ఎవరైనా ట్రేడర్లు తక్కువ ధరకు విక్రయిస్తే, వెంటనే కంట్రోల్ రూమ్‌ను సంప్రదించాలని రైతులకు సూచించారు. సంప్రదించాల్సిన నంబర్లు: 9573990331, 9030315951.

Similar News

News September 10, 2025

జగిత్యాల: కాళోజీ రచనలు సమానత్వాన్ని ప్రతిబింబించాయి

image

జగిత్యాల జిల్లా సమీకృత కలెక్టరేట్ భవన సముదాయంలో మంగళవారం కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రజాకవి కాళోజీ సేవలు, తెలంగాణ ఉద్యమానికి ఆయన చేసిన కృషి, రచనలు, తెలంగాణ సంస్కృతి, స్వేచ్ఛ, సమానత్వాన్ని ప్రతిబింబించాయని కలెక్టర్ అన్నారు.

News September 10, 2025

జగిత్యాల: SEPT 13న జాతీయ మెగా లోక్ అదాలత్

image

ఈనెల 13న జాతీయ మెగా లోక్ అదాలత్ అన్ని కోర్టు ప్రాంగణాల్లో జరుగుతుందని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. క్రిమినల్, కంపౌండబుల్, సివిల్ తగాదా, ఆస్తి విభజన, కుటుంబపరమైన నిర్వహణ, వైవాహిక జీవితం, బ్యాంకు రికవరీ, విద్యుత్ చౌర్యం, చెక్ బౌన్స్, డ్రంక్ అండ్ డ్రైవ్, పెట్టీ కేసులు, ఇతర రాజీ పడే కేసుల్లో కక్షిదారులు ఈ కార్యక్రమం ద్వారా రాజీకి రావాలని సూచించారు. రాజీ మార్గం రాజ మార్గమన్నారు.

News September 10, 2025

నేడే ‘సూపర్ సిక్స్ – సూపర్ హిట్’

image

AP: సూపర్ సిక్స్ హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వంలోని TDP, JSP, BJP తొలిసారి భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నాయి. ఇవాళ అనంతపురంలో ‘సూపర్ సిక్స్-సూపర్ హిట్’ పేరిట కార్యక్రమం జరగనుంది. CM చంద్రబాబు, Dy.CM పవన్, BJP రాష్ట్రాధ్యక్షుడు మాధవ్ సహా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు. 15 నెలల్లో రాష్ట్రంలో అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించనున్నారు.