News February 3, 2026

టారిఫ్‌ల తగ్గింపుతో ఆక్వా రైతులకు ఆదాయం: అచ్చెన్న

image

AP: అమెరికా టారిఫ్‌లను 25 నుంచి 18 శాతానికి తగ్గించడం వల్ల ఆక్వా రంగానికి ఉపశమనం లభిస్తుందని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. ఆ దేశానికి సముద్ర ఆహార ఎగుమతులు 15% వరకు పెరుగుతాయన్నారు. కేంద్ర బడ్జెట్‌లో సీ ఫుడ్ ప్రాసెసింగ్‌కు అవసరమైన ఇన్‌పుట్స్‌పై కల్పించిన రాయితీలు ఈ రంగానికి అదనపు మద్దతును అందిస్తాయని తెలిపారు. దీంతో రైతులు, మత్స్యకారులకు ఆదాయ స్థిరత్వం, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు.

Similar News

News February 17, 2026

కర్తరీ దోషం అంటే ఏమిటి?

image

సూర్యుడు కృత్తికా నక్షత్రంలో సంచరించే కాలాన్ని ‘కర్తరీ దోషం’ అంటారు. దీన్నే ‘అగ్ని నక్షత్రం’ అని కూడా పిలుస్తారు. సాధారణంగా ఇది ప్రతి ఏటా మే నెలలో వస్తుంది. ఈ సమయంలో సూర్య కిరణాలు భూమిపై నేరుగా పడతాయి. దీనివల్ల ఎండలు విపరీతంగా పెరుగుతాయి. ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరుకుంటాయి. ఈ కాలాన్ని ప్రకృతి పరంగా కష్టకాలంగా భావిస్తారు. అందుకే ఈ 15-20 రోజుల పాటు ఎలాంటి కొత్త పనులు ప్రారంభించరు.

News February 17, 2026

మామిడి పంట.. ఈ దశలో పోషకాలు అందించండి

image

మామిడి పిందెలు బఠాణీ లేదా గోళీకాయ సైజులో ఉన్నప్పుడు చెట్లకు మరోసారి పోషకాలను అందించాలంటున్నారు నిపుణులు. ఈ దశలో లీటరు నీటికి పొటాషియం నైట్రేట్ 10-15 గ్రా., యూరియా లీటరు నీటికి 10 గ్రా. మరియు అర్కమ్యాంగో స్పెషల్ లీటరు నీటికి 5గ్రా. లేదా ఫార్ములా-4 లీటరు నీటికి 2.5గ్రా సూక్ష్మపోషకాల మిశ్రమాన్ని కలిపి పిచికారీ చేయాలి. దీని వల్ల పిందె రాలడం తగ్గి కాయలు మంచి సైజుకు వచ్చి అధిక బరువు పెరుగుతాయి.

News February 17, 2026

ఇవాళ్టి నుంచి CBSE బోర్డు పరీక్షలు!

image

CBSE 10, 12వ తరగతి పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. దేశవ్యాప్తంగా 25 లక్షల మంది టెన్త్‌, 18.5 లక్షల మంది 12వ తరగతి విద్యార్థులు హాజరుకానున్నారు. రోజూ 10.30AM-1.30PM మధ్య ఎగ్జామ్స్ జరుగుతాయి. 10AM తర్వాత పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు. రెగ్యులర్ విద్యార్థులు స్కూల్ డ్రెస్‌లో రావాలి. ప్రైవేటు స్టూడెంట్లు సాధారణ దుస్తుల్లో రావచ్చు. టెన్త్ విద్యార్థులకు మే నెలలో <<19159258>>రెండో విడత<<>> పరీక్షలు జరుగుతాయి.