News April 5, 2026
టాస్ గెలిచిన చెన్నై

IPL: RCBపై చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఈ మ్యాచు జరగనుంది.
CSK: రుతురాజ్ (C), శాంసన్, ఆయుష్, సర్ఫరాజ్, ప్రశాంత్ వీర్, దూబే, నూర్ అహ్మద్, ఓవర్టన్, హెన్రీ, కాంబోజ్, ఖలీల్.
RCB: సాల్ట్, కోహ్లీ, పడిక్కల్, పాటిదార్(C), జితేశ్, టిమ్ డేవిడ్, షెఫర్డ్, కృనాల్, భువనేశ్వర్, అభినందన్, జాకబ్ డఫీ.
Similar News
News April 7, 2026
ఆ పదాన్ని వాడటం అశ్లీలత కాదు: సుప్రీంకోర్టు

తీవ్ర వాగ్వాద సమయంలో ‘బా*ర్డ్’ పదం వాడటం IPC సెక్షన్ 294 ప్రకారం అశ్లీలత కాదని సుప్రీంకోర్టు వెల్లడించింది. ఈ వర్డ్‌ను ఉపయోగించడం ఇప్పుడు సాధారణమైందంది. ఈ సెక్షన్ కింద కేసు పెట్టాలంటే సెక్సువల్/ప్రూరియంట్(కామ ప్రేరక) ఎలిమెంట్ ఉండాలని తెలిపింది. ఓ భూవివాదం సందర్భంగా ‘బా*ర్డ్’ పదాన్ని వాడినందుకు సెక్షన్ 294(B) ప్రకారం ఇద్దరిని దోషులుగా నిర్ధారిస్తూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేసింది.
News April 7, 2026
వాట్సాప్‌లో మీకు ఈ మెసేజ్ వచ్చిందా?

కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు <<19512470>>‘సిమ్ బైండింగ్’<<>> అమలుకు వాట్సాప్ టెస్టింగ్ ప్రారంభించినట్లు తెలుస్తోంది. ‘మీ ఫోన్‌లోని సిమ్ నంబర్‌ను తనిఖీ చేయడానికి అనుమతించండి’ అనే సందేశాలను యూజర్లకు పంపుతోంది. ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్ వైరలవుతోంది. డిసెంబర్ 31 తర్వాత రిజిస్టర్డ్ సిమ్ కార్డు ఫోన్‌లో లేకపోతే మెసేజింగ్ యాప్‌లు పనిచేయవు.
* మీకు ఇలాంటి మెసేజ్ వచ్చిందా? కామెంట్ చేయండి.
News April 7, 2026
ఇంటర్.. ప్రత్యేకంగా అదనపు సబ్జెక్ట్ ఫలితాలు?

AP: ఇంటర్ విద్యలో సంస్కరణల్లో భాగంగా విద్యార్థులు 5 గ్రూప్ సబ్జెక్టులతోపాటు అదనంగా ఆరో సబ్జెక్టును ఎంపిక చేసుకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ సబ్జెక్టు ఫలితాలను ప్రత్యేకంగా వెబ్‌సైట్‌లో పెట్టడం లేదా కాలేజీలకు పంపాలని అధికారులు యోచిస్తున్నారు. రెగ్యులర్ సబ్జెక్టుల రిజల్ట్స్ ఈ నెల 15-20 మధ్య రిలీజ్ చేసే <<19571013>>అవకాశం ఉంది<<>>.


