News December 19, 2025
టాస్ గెలిచిన భారత్.. ఓవర్లు తగ్గింపు

దుబాయి వేదికగా శ్రీలంకతో జరుగుతోన్న ఏసీసీ మెన్స్ U19 ఆసియా కప్ సెమీ ఫైనల్-1లో భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. వర్షం కారణంగా టాస్ ఆలస్యమైంది. ఒక్కో ఇన్నింగ్స్‌ను 20 ఓవర్లకు కుదించారు.
IND: ఆయుశ్ మాత్రే (C), వైభవ్, ఆరోన్ జార్జ్, విహాన్, వేదాంత్, అభిజ్ఞాన్ కుందు, కనిష్క్, ఖిలాన్, దీపేశ్, కిషన్ కుమార్ సింగ్, హెనిల్
LIVE: సోనీ స్పోర్ట్స్ ఛానల్, సోనీ లివ్ యాప్
Similar News
News December 27, 2025
జరీబు భూములపై పరిశీలనకు ఆదేశం

AP: రాజధాని ప్రాంతంలోని జరీబు(3 పంటలు పండేవి) భూములపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భూముల వర్గీకరణపై పున:పరిశీలనకు రాష్ట్రస్థాయి కమిటీ ఏర్పాటు చేసింది. జరీబు, నాన్ జరీబు భూములు ఇచ్చినవారికి ప్లాట్లు ఇస్తున్నామని, ఈ ప్రక్రియ 45రోజుల్లో పూర్తి చేయనున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు.
News December 27, 2025
పోస్ట్ పార్టమ్ డిప్రెషన్‌కు దీంతో చెక్

కొందరు మహిళలు డెలివరీ తర్వాత డిప్రెషన్‌కు లోనవుతుంటారు. దీనివల్ల తల్లీబిడ్డలిద్దరికీ ప్రమాదమే అంటున్నారు నిపుణులు. అయితే డెలివరీ తర్వాత డిప్రెషన్ రాకుండా తక్కువ మోతాదులో ఎస్కెటమైన్ ఇంజెక్షన్ ఇస్తే ఫలితం ఉంటుందంటున్నారు. డిప్రెషన్‌కు వాడే కెటమైన్ అనే మందు నుంచే ఎస్కెటమైన్‌ను తయారు చేస్తారు. పరిశోధనల్లో ఇది సుమారు 75% వరకూ డిప్రెషన్ లక్షణాలు రాకుండా చూసినట్లు పరిశోధకులు వెల్లడించారు.
News December 27, 2025
H-1B ఆంక్షలు.. ఇండియాకు జాబ్ లక్!

H-1B వీసా నిబంధనల్ని US కఠినం చేయడం ఒకరకంగా మనకు కలిసొచ్చింది. అక్కడ ఫీజులు, భారీ వేతనాల నేపథ్యంలో బడా టెక్ కంపెనీలు ఇండియాలో ఉద్యోగాల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఈ ఏడాది పలు సంస్థలు భారత్‌లో 32,000 మందికి కీలక రంగాల్లో ఉద్యోగాలిచ్చాయి. వీసా గోల లేకపోవడం, తక్కువ ఖర్చు కలిసొచ్చింది. అమెరికా ఆంక్షలు అక్కడ నిరుద్యోగాన్ని పెంచి మన IT రంగానికి ఊపిరి పోస్తున్నాయి.


