News December 22, 2025
టిప్పే రూ.68,600 ఇచ్చేశాడు!

ప్రతి ఒక్కరికీ ఏదో ఒక హాబీ, అభిరుచి ఉంటుంది. కొందరిలో అది కాస్త ఎక్కువ ఉంటుంది. బెంగళూరులో ఓ వ్యక్తి డెలివరీ బాయ్స్‌కు ఏడాదిలో ₹68,600, చెన్నై యూజర్ ₹59,505 టిప్స్ ఇచ్చినట్లు స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ వెల్లడించింది. ‘ముంబైకర్ ఏడాదిలో రెడ్ బుల్ షుగర్ ఫ్రీ కోసం ₹16.3L, నోయిడా వ్యక్తి బ్లూటూత్ స్పీకర్లు, SSDల కోసం ₹2.69L వెచ్చించారు. ఓ హైదరాబాదీ 3 ఐఫోన్స్ కోసం ₹4.3L ఖర్చు చేశారు’ అని తెలిపింది.
Similar News
News December 24, 2025
PPP విధానం.. ఒక్క టెండర్ మాత్రమే వచ్చింది!

AP: <<17611905>>PPP విధానం<<>>లో వైద్య కళాశాలల్ని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం పిలిచిన టెండర్లకు ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. తొలి విడతలో ఆదోని, మార్కాపురం, మదనపల్లి, పులివెందులలో కళాశాలలను PPP మోడల్‌లో నిర్వహించేందుకు వైద్య ఆరోగ్య శాఖ టెండర్లు పిలిచింది. టెండర్ల గడువును 2సార్లు పొడిగించినప్పటికీ ఆదోని కళాశాలకు మాత్రమే ఒక్క బిడ్ దాఖలైంది. దీనికి గల కారణాలపై చర్చిస్తామని సంబంధిత అధికారులు తెలిపారు.
News December 24, 2025
గర్భనిరోధక మాత్ర ఎలా పని చేస్తుందంటే?

ఈ టాబ్లెట్లలో లెవోనోర్‌జెస్ట్రల్ అనే హార్మోన్ ఉంటుంది. ఇది సహజంగా లభించే స్త్రీ సెక్స్ హార్మోన్ ప్రొజెస్టెరాన్ సింథటిక్ వెర్షన్. ఓవులేషన్ సమయంలో అండం విడుదల అవుతుంది. అయితే ఈ టాబ్లెట్ తీసుకోవడం వల్ల ఆ ప్రక్రియ వాయిదా పడుతుంది. అండం ఉత్పత్తిని తాత్కాలికంగా నిలిపివేయడం, ఫలదీకరణాన్ని నిరోధించడం వంటివి చేస్తుంది. అలాగే ఫలదీకరణం అయిన అండం గర్భాశయంలో అమర్చబడకుండా చేసి గర్భధారణను నిరోధిస్తుంది.
News December 24, 2025
శని దోషమా? ఇవి దానం చేయండి..

పుష్య మాసంలో చేసే చిన్న దానమైనా శని దోషాల నుంచి విముక్తి కలిగిస్తుందని పండితులు చెబుతున్నారు. జాతకంలో శని ప్రభావం ఉన్నవారు అన్నదానం, వస్త్రదానం చేయాలంటున్నారు. ‘చలి తీవ్రత ఎక్కువగా ఉండే ఈ రోజుల్లో కంబళ్లు, దుప్పట్లు దానం చేస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది. శని దేవుడికి ప్రీతికరమైన ఈ మాసంలో కొన్ని సరళమైన పరిహారాలతో శని బాధలను తగ్గించుకోవచ్చు’ అంటున్నారు. ఆ పరిహారాల కోసం <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>కి వెళ్లండి.


